Site icon HashtagU Telugu

Health Tips: ప్రతిరోజు రాగిజావ తాగడం వల్ల కేవలం లాభాలు మాత్రమే కాదండోయ్ నష్టాలు ఉన్నాయని మీకు తెలుసా?

Health Tips

Health Tips

రాగిజావ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదివరకటి రోజుల్లో అనగా మన పెద్దల కాలంలో రాగి జావాను ఎక్కువగా తాగేవారు. కానీ ఈ మధ్యకాలంలో కరోనా తర్వాత ఆరోగ్యం గురించి శ్రద్ధ ఎక్కువ అవ్వడంతో బయట టీ స్టాల్లో రాగిజావను అమ్మడం మొదలుపెట్టారు. అలా కొంతమంది టీ కాఫీలకు రాగి జావా తాగడం మొదలుపెట్టారు. కాగా రాగి జావాలో ఎక్కువ పోషకాలు ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇందులో విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వులు, ప్రోటీన్లు అన్ని అవసరమైన స్థూల పోషకాలను కలిగి ఉంటుంది. ప్రతిరోజు రాగి జావాను తాగవచ్చు. కానీ రాగి జావను ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదట.రాగి జావను ఉదయం తీసుకుంటే చాలా మంచిదని, కానీ రాత్రిపూట తీసుకోవడం అంత మంచిది కాదని చెబుతున్నారు. ఇక మూత్రపిండాల్లో రాళ్లు లేదా మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవారు రాగిజావకు దూరంగా ఉంటేనే మంచిదట. బరువు పెరగాలి అనుకునేవారు రాగి జావాను ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిదని,ఎందుకంటే రాగజావ వినియోగంతో బరువు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

అలాగే రాగి జావ అధిక వినియోగం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వచ్చే అవకాశం ఉంటుందట. కొందరికి దీని వల్ల కొందరిలో అలర్జీ వంటివి కూడా రావచ్చని చెబుతున్నారు. అదేవిధంగా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు రాగులు తినకపోవటం మంచిదట. రాగిలో థైరాయిడ్ గ్రంథి సాధారణ పనితీరుకు ఆటంకం కలిగించే గోయిట్రోజెన్‌ లతో నిండి ఉంటుందని చెబుతున్నారు. రాగి జావ ఎక్కువగా తీసుకోవటం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందట. మూత్రపిండాల్లో రాళ్లు లేదా మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవారు కూడా దీనికి దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు.