Summer Foods: వేస‌విలో ప్ర‌తి ఒక్క‌రూ తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే..!

వేసవి కాలంలో మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా (Summer Foods) ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరంలో నీటి కొరత అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

  • Written By:
  • Publish Date - April 2, 2024 / 02:35 PM IST

Summer Foods: వేసవి కాలంలో మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా (Summer Foods) ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరంలో నీటి కొరత అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సీజన్‌లో డీహైడ్రేషన్, హీట్‌స్ట్రోక్ సమస్య పెరుగుతుంది. వీటిని నివారించడానికి వైద్యులు కొన్ని ప‌దార్థాల‌ను ఆహారంలో చేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా, చల్లగా ఉంచుతాయ‌ట‌. ఈ రోజు మనం అలాంటి కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం. ఇవి వేసవి కాలంలో మిమ్మల్ని హైడ్రేట్ గా.. చల్లగా ఉంచట‌మే కాకుండా హీట్ వేవ్ నుండి కాపాడుతాయి. ఈ ఆరోగ్యకరమైన ఆహారాల గురించి ఇప్పుడు వివ‌రంగా తెలుసుకుందాం.

మీ ఆహారంలో మజ్జిగ లేదా పెరుగును చేర్చుకోండి

వేసవిలో మజ్జిగ లేదా పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. మజ్జిగలో నల్ల ఉప్పు, ఇంగువ, జీలకర్ర పొడి కలిపి తాగడం వల్ల వేసవిలో హీట్ స్ట్రోక్ నుండి దూరంగా ఉండవచ్చని వైద్యులు స‌ల‌హా ఇస్తున్నారు. అంతేకాదు జీర్ణక్రియను కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

కొబ్బరి నీరు ప్రయోజనకరంగా ఉంటుంది

వేసవిలో హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు కొబ్బరి నీటిని క్రమం తప్పకుండా తాగ‌వ‌చ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Also Read: Ranga Reddy: గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు

కీర దోసకాయ కూడా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది

వేసవి కాలంలో శరీరంలో నీటి కొరత లేకుండా ఉండాలంటే కీర దోసకాయ తినవచ్చు. అందులో నీటి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడానికి మీరు ర‌హితా లేదా చల్లని సూప్ త్రాగవచ్చు. సలాడ్ రూపంలో తినవచ్చు.

మీ ఆహారంలో ద్రాక్షను చేర్చండి

వేసవిలో లభించే జ్యుసి, టేస్టీ ఫ్రూట్ ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ద్రాక్ష‌ తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ద్రాక్ష తినడం వల్ల మీ చర్మాన్ని వడదెబ్బ నుండి కాపాడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join

లిచ్చి ప్రయోజనకరంగా ఉంటుంది

వేసవి వచ్చిన వెంటనే లిచ్చి కూడా మార్కెట్‌లో సమృద్ధిగా కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో మీరు దీన్ని ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం మరియు విటమిన్ సి వంటి అంశాలు పుష్కలంగా ఉన్నాయని, ఇది ఆరోగ్యానికి వరం కంటే తక్కువ కాదని మీకు తెలియజేద్దాం.