Site icon HashtagU Telugu

Beauty Tips: ఎండల్లో మీ చర్మం తాజాగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సూపర్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!

Beauty Tips

Beauty Tips

మాములుగా వేసవికాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిలో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలతో పాటు అందానికి సంబందించిన సమస్యలు కూడా ఒకటి. కాగా వేసవిలో శరీరాన్ని తేమతో ఉంచడం ముఖ్యం. అందుకే ఎక్కువ ద్రవ పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే వేడి వల్ల తలెత్తే అసౌకర్యాన్ని తగ్గించడానికి చల్లటి నీటితో స్నానం చేయడం మంచిది.అయితే సాధారణ నీటితో కాకుండా కొన్ని సహజ పదార్థాలతో స్నానం చేస్తే చర్మ ఆరోగ్యానికి మంచిదట. ఇది రక్త ప్రసరణ మెరుగుపరచడమే కాకుండా ఒత్తిడిని తగ్గించి మెరుగైన నిద్రకు సహాయపడుతుందని చెబుతున్నారు.

మరి ఇంతకీ స్నానం చేసే నీటిలో ఎలాంటి పదార్థాలు కలుపుకోవాలి అన్న విషయానికి వస్తే.. శరీర నొప్పులను తగ్గించేందుకు అల్లం రసం ఉపయోగపడుతుంది. ఒక బకెట్ నీటిలో కొద్దిగా అల్లం పొడి లేదా అర కప్పు అల్లం రసాన్ని కలిపి స్నానం చేయాలట. ఇది చెమట వాసనను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే చర్మాన్ని పొడిబారకుండా ఉంచేందుకు ఆలివ్ నూనె ఉపయోగించాలట. ఇది తేమను కాపాడి చర్మాన్ని మెరుగు పరుస్తుందట. కాగా మొటిమలు ఉన్నవారు వైద్యుల సలహాతో ఆలివ్ నూనె ఉపయోగించాలని చెబుతున్నారు.

వేప నీటితో స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయట. ఇందుకోసం కొన్ని వేప ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిని చల్లారిన తర్వాత స్నానానికి ఉపయోగించాలట. ఇలా చేసే వేసవికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు అలర్జీలు వంటివి రావు అని చెబుతున్నారు.vశరీరాన్ని చల్లగా ఉంచి మంచి సువాసన రావడానికి రోజ్ వాటర్ ఉపయోగపడుతుందట.. 4,5 గులాబీ రేకులను మరిగించి ఆ నీటిని స్నానానికి ఉపయోగించాలట. లావెండర్ ఆయిల్ ఒత్తిడిని తగ్గించి చెమట వాసనను దూరం చేస్తుందని కాబట్టి స్నానం చేసిన నీటిలో కొంచెం లావెండర్ ఆయిల్ వేసి స్నానం చేయాలని చెబుతున్నారు. పసుపు శరీరాన్ని శుభ్రం చేయడంలో సహాయపడుతుందట. కాబట్టి కొద్దిగా పసుపును గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేయాలట. కాగా గంధపు నీరు ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందట. కొద్దిగా గంధపు పొడిని లేదా గంధపు నూనెను నీటిలో కలిపి స్నానం చేయాలట.