Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ దుంపలను తినాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో అధిక బరువు అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఆడ మగ అని తేడా లేకుండా ప్రతిఒక్కరు అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. అయితే బర

Published By: HashtagU Telugu Desk
Weight Loss

Weight Loss

ప్రస్తుత రోజుల్లో అధిక బరువు అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఆడ మగ అని తేడా లేకుండా ప్రతిఒక్కరు అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. అయితే బరువును తగ్గించుకోవడం కోసం వ్యాయామాలు, ఎక్సర్ సైజులు,చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అయితేవాటితో పాటుగా కొన్ని రకాల దుంపలను తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గవచ్చు. రూట్ వెజిటెబుల్స్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ సహా ఇతర పోషకాలు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

మరి ఎటువంటి దుంపలను తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. క్యారెట్లు ప్రోటీన్లకు మంచి మూలం. క్యారెట్ లో తక్కువ కేలరీలు ఉంటాయి. డైటరీ ఫైబర్, విటమిన్ ఏ, సీ, పొటాషియం, బీటా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. క్యారెట్లను నేరుగా తినవచ్చు. లేదా సూప్‌లు, సలాడ్‌లు, రోస్ట్, గ్రిల్ సహా వండుకుని తినవచ్చు. ఉల్లిపాయ.. వంటకం ఏదైనా అందులో ఉల్లిపాయ లేకపోతే రుచి రాదు. చాలామంది ఉల్లిపాయలను పచ్చిగా కూడా తింటూ ఉంటారు. ఉల్లిపాయల్లో ప్రీబయోటిక్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది.

ఉల్లిపాయల్లో విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చిలగడదుంపలు.. వీటిని స్వీట్ పొటాటో అని పిలుస్తుంటారు. ఈ చిలకడ దుంపలను కొందరు పచ్చిగా తింటే మరికొందరు ఉడకబెట్టుకుని తింటూ ఉంటారు. దీని వల్ల కడుపు నిండిన భావన కలగడంతో పాటు ఆకలి తగ్గుతుంది. కొవ్వు, ప్రోటీన్ యొక్క జీర్ణక్రియను ప్రేరేపించే కోలిసిస్టోకినిన్ ఉంటుంది. చిలగడదుంపలోని రెసిస్టెంట్ స్టార్చ్ ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అల్లం.. అల్లం జీర్ణ క్రియ, శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. అల్లంని ఎక్కువగా మసాలా వంటకాలలో అలాగే టీ చేసేటప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు. అల్లంలో థర్మోజెనిక్ లక్షణాలు కూడా ఉంటాయి. అల్లం శరీరంలోని కేలరీలను బర్న్ చేస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. బీట్‌.. బీట్ రూట్‌ లో విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బీట్‌ రూట్‌ ను సలాడ్, స్మూతీ, జ్యూస్, బేక్డ్ చిప్స్ గా తయారు చేసుకుని తినచ్చు.

  Last Updated: 04 Jun 2023, 04:28 PM IST