Site icon HashtagU Telugu

ThippaTheega : ప్రతిరోజు ఒక గ్లాసు తిప్పతీగ జ్యూస్ తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 30 Jan 2024 01 33 Pm 3443

Mixcollage 30 Jan 2024 01 33 Pm 3443

ఈ మధ్యకాలంలో తిప్పతీగ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ తిప్పతీగ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిసి చాలామంది ఈ ఆకును ఎక్కువగా ఉపయోగించడంతోపాటు కొంతమంది ఏకంగా చెట్లను ఇంట్లోనే పెంచుకుంటున్నారు. చాలామంది ఈ తిప్పతీగ ఆకులు ప్రతిరోజు తీసుకుంటూ ఉంటారు. తిప్పతీగ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనం అందరికీ తెలిసిందే. ఈ తిప్పతీగ జ్యూస్ ని తాగడం వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి ప్రతిరోజు ఒక గ్లాసు తిప్పతీగ జ్యూస్ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రస్తుతం మార్కెట్ లో తిప్ప తీగ.. పౌడర్, జ్యూస్ రూపంలో లభిస్తోంది. వివిధ కంపెనీలు వీటిని తయారు చేసి అమ్ముతున్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తిప్పతీగ జ్యూస్ ని తీసుకోవడం చాలా మంచిది. ఎక్కువగా తాగడానికి ఇష్టపడని వారు రెండు నుంచి మూడు టీ స్పూన్లు జ్యూస్ తాగితే సరిపోతుంది. ఈ తిప్పతీగ జ్యూస్ తాగిన తర్వాత అర్ధగంట సేపు పానీయాలు ఏవి తీసుకోకూడదు. ఇలా చేస్తే మందు బాగా పని చేస్తుంది. తిప్ప తీగ జ్యూస్ ని తాగటం వల్ల జ్వరం తగిలినా తగ్గిపోతుంది. షుగర్ రెండో దశలో ఉన్న పేషెంట్లు తిప్ప తీగ జ్యూస్ తీసుకుంటే చక్కెర స్థాయిలు ఎక్కువ, తక్కువ కాకుండా నార్మల్ గా ఉంటాయి. అంటు వ్యాధులు కూడా మనల్ని అంటుకోకుండా దూరంగా ఉండిపోతాయి. బాడీలో ఇమ్యునిటీ పవర్ పెరగటం వల్ల ఇతర రోగాలు మన దరి చేరవు. ఒకవేళ చేరినా త్వరగా నయమైపోతాయి.

తిప్ప తీగ జ్యూస్ ని తాగినవాళ్లకు తిండి అరగకపోవటం అనేదే ఉండదు. విరేచనం సాఫీగా జరుగుతుంది. జీర్ణ సమస్యలు తలెత్తవు. కాబట్టి గ్యాస్ ప్రాబ్లం వంటివి రావు. మానసికపరమైన సమస్యలూ తొలగుతాయి. ఒత్తిడి, ఆందోళన ఇబ్బంది పెట్టవు. కంటి చూపు మందగించదు. ఒక్క మాటలో చెప్పాలంటే తిప్ప తీగ జ్యూస్ ని సర్వ రోగ నివారిణిగా చెప్పవచ్చు. తిన్న ప్రతి ఆహార పదార్థమూ చక్కగా అరుగుతుందంటే ఒంట్లో ఎనర్జీకి ఢోకా ఉండదు. తిప్ప తీగను డబ్బులిచ్చి కొనాల్సిన పని లేదు. సహజంగానే దొరుకుతుంది. పల్లెటూళ్లల్లో అయితే చేలల్లో, పొలాల్లో, సిటీలో అయితే పార్కుల్లో, గార్డెన్లలో ఉంటుంది. కాకపోతే దాన్ని గుర్తుపట్టగలిగితే చాలు. తిప్ప తీగ జ్యూస్, పౌడర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందువల్ల తిప్ప తీగను ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం అని చెప్పవచ్చు.

Exit mobile version