Site icon HashtagU Telugu

Morning Drinks: గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Morning Drinks

Morning Drinks

మనలో చాలామందికి ఉదయం సమయంలో గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకొని తాగడం అలవాటు. ఇలా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు నయం అవుతాయని నమ్ముతూ ఉంటారు. అయితే నిజంగానే ఆరోగ్య సమస్యలు నయమవుతాయా ? ప్రయోజనాలు కలుగుతాయా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా మంది ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగుతారని, కొంతమంది నిమ్మరసం, జీరక్రర నీళ్లు, మెంతుల నీరు, ధనియాల వాటర్‌, గోరువెచ్చని నీళ్లలో తేన కలుపుకుని తాగుతారు.

అయితే వాతావరణం, ఆరోగ్యం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ పానీయాలు తీసుకోవాలి. లేకుంటే ఆరోగ్యానికి హానికలిగే ప్రమాదం ఉంది. ఉదయం పూట జీలక్రర వాటర్‌ తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్స్‌ తొలగిపోతాయి. ఉదయం ఖాళీ కడుపుతో మెంతుల నీరు తాగితే డయాబెటిస్‌ కంట్రోల్‌లో ఉంటుంది, బరువు తగ్గుతారు, హార్మోన్లు సమతుల్యం అవుతాయి. వేసవి, శరదృతువులో శరీరం చల్లగా ఉండాలంటే ధనియాల నీరు తాగాలి.
నిమ్మరసం, గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అందరికీ తెలుసు. అయితే ఈ నీళ్లు అందరికీ ఒకేలా పనిచేయవు. నిమ్మరసం, గోరువెచ్చని నీళ్లు తాగితే.. కొందరికీ ఎసిడిటీ, పిత్త దోషం, సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

ఈ నీళ్లు తాగేవారు 40 రోజులకు ఒకసారి గ్యాప్‌ తీసుకోవాలి. తేనెను గోరువెచ్చని, వేడి నీళ్లలో వేసుకుని తాగకూడదని డాక్టర్‌ వరలక్ష్మి అన్నారు. ఇది తేనెలోని లక్షణాలను నాశనం చేస్తుంది, తేనె విషంగా మారే ప్రమాదం ఉంది. ఆయుర్వేదంలో బరువు తగ్గడానికి ఈ పానీయం తాగమని సిఫారసు చేయలేదు. ఈ కాంబినేషన్‌ వాత, పిత్త దోషాలను శాంతపరుస్తుంది. ఆకలి, గ్యాస్ట్రిక్ అగ్నిని పెంచుతుంది. అజీర్ణం సమస్యతో బాధపడేవాళ్లు ఈ నీళ్లు తాగకూడదు. పచ్చి ఆహారం ఖాళీ కడుపుతో సులభంగా జీర్ణం కాదు. ఉసిరి, మునగ, సొరకాయ, పాలకూర వంటి జ్యూస్‌లు ఎక్కువ కాలం తాగితే.. పిత్త, లివర్‌ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీనికారణంగా కుడుపు ఉబ్బరం వచ్చే ప్రమాదం ఉంది.

Exit mobile version