పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పాలు పాల పదార్థాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ పాలు తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. పాలల్లో ఉండే క్యాల్షియం ఎముకలను గట్టి పరుస్తుంది. మెగ్నీషియం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ ప్రమాదం కూడా తగ్గుతుంది. పాలలో ఉండే పాల విరుగుడు ప్రోటీన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సరైన స్థాయిలో నిర్వహించడానికి సహాయపడుతుంది.
పాల ఉత్పత్తుల లోని విటమిన్ డి జీవక్రియ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. పాల ఉత్పత్తుల లోని ఆహార కొవ్వు ఆమ్లాలు, ట్రాన్స్ పాల్మిటోలిక్ ఆమ్లం, షార్ట్, చైన్ కొవ్వు ఆమ్లాలు శరీర బరువుతో పాటు ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా ప్రభావితం చేస్తాయట. కాగా పెరుగులోని ప్రోబయోటిక్స్ జీవక్రియ పనితీరుకు అదే విధంగా పేగు ఆరోగ్యానికి ప్రయోజనకరమైన ఆరోగ్య ప్రభావాలను అందిస్తాయట. అయితే పాలలో కొవ్వు స్థాయిలకు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదానికి మధ్య ఖచ్చితమైన సంబంధాన్ని ఇంకా పూర్తిగా నిర్ధారించలేదట.
ఒకవేళ ఆ మధుమేహం ఉన్నవారు పాలు పాల పదార్థాలు తీసుకోవాలి అనుకున్నప్పటికీ తక్కువ కొవ్వు గల పాలను తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. పాలు తాగిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేసుకోవాలట. రోజుకు ఒక గ్లాసు పాలు మాత్రమే తాగాలని చెబుతున్నారు.. పాలలో చక్కెర కలపకుండా తాగడం మంచిదని చెబుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు పాలు తీసుకోవచ్చా లేదా అనే సందేహం ఉంటే, వైద్యుడిని సంప్రదించడం మంచిది.