చెప్పులు వాడుతున్నారా? అయితే ఈ న్యూస్ చ‌ద‌వాల్సిందే!

టానింగ్‌ను శుభ్రం చేయడానికి పెరుగు, శనగపిండిని ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో కొంచెం శనగపిండిని తీసుకోవాలి.

Published By: HashtagU Telugu Desk
Feet Tan

Feet Tan

Feet Tan: వేసవి ఎండలు, ధూళి వల్ల చేతులు, కాళ్లు నల్లబడటం మొదలవుతుంది. ముఖ్యంగా కాళ్లపై ఈ మురికి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పులు వాడేవారి పాదాలు కొంత భాగం వ‌ర‌కు న‌ల్ల‌గా, కొంత‌భాగం తెల్ల‌గా క‌నిపిస్తాయి. అమితు చాలామంది శరీరంలోని మిగిలిన భాగాలను శుభ్రం చేసుకుంటారు. కానీ కాళ్లను సరిగ్గా పట్టించుకోరు. దీనివల్ల కాళ్లపై చేరిన మురికి పేరుకుపోయి, చర్మం నల్లగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో కాళ్లపై ఉన్న ఈ టానింగ్‌ను తొలగించడానికి ఎలాంటి ఇంటి చిట్కాలను ఉపయోగించవచ్చో ఇక్కడ తెలుసుకోండి. ఈ చిట్కాలను మీరు చేతుల నలుపును వదిలించుకోవడానికి కూడా వాడవచ్చు.

కాళ్ల నలుపును పోగొట్టే చిట్కాలు

పెరుగు- శనగపిండి

టానింగ్‌ను శుభ్రం చేయడానికి పెరుగు, శనగపిండిని ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో కొంచెం శనగపిండిని తీసుకోవాలి. అందులో అర చెంచా పసుపు వేసి, తగినంత పెరుగు కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను చేతులు, కాళ్లకు రుద్ది, కాసేపు అలాగే ఉంచి ఆపై కడిగేయాలి. వారానికి 2 నుండి 3 సార్లు ఇలా చేయడం వల్ల నలుపు క్రమంగా తగ్గుతుంది.

Also Read: ఈ మహిళలు రాత్రి పూట పెరుగు తినకూడదు?

బంగాళదుంప రసం- నిమ్మరసం

కాళ్లపై పేరుకుపోయిన మురికిని వదిలించడానికి బంగాళదుంప, నిమ్మకాయ బాగా పనిచేస్తాయి. ఈ రెండింటిలోనూ బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మానికి లైటనింగ్ ఎఫెక్ట్‌ను ఇస్తాయి. ఒక బంగాళదుంపను తురిమి దాని రసాన్ని పిండాలి. ఆ రసంలో సమాన పరిమాణంలో నిమ్మరసం కలిపి కాళ్లకు పట్టించాలి. 15 నుండి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

టమోటా గుజ్జు

టమోటా రసం, దాని గుజ్జు రెండూ టానింగ్‌ను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. టమోటాను మెత్తగా చేసి నేరుగా కాళ్లపై రుద్ది, కాసేపు ఉంచి ఆ తర్వాత కడిగేయాలి. చర్మాన్ని శుభ్రం చేయడంలో టమోటా ఎంతగానో సహాయపడుతుంది.

ఓట్స్- పెరుగు

టానింగ్ వల్ల చర్మంపై మృతకణాలు పేరుకుపోతాయి. ఈ మృతకణాలను తొలగించడానికి ఓట్స్, పెరుగుతో చేసిన స్క్రబ్‌ను వాడవచ్చు. దీని కోసం ఓట్స్‌ను బరకగా మిక్సీ పట్టి, అందులో పేస్ట్‌లా అయ్యేంత పెరుగు కలపాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి కాళ్లపై మసాజ్ చేయాలి. 3 నుండి 4 నిమిషాల పాటు బాగా రుద్దిన తర్వాత కడిగేయాలి. ఈ చిట్కాను వారానికి 1-2 సార్లు ప్రయత్నించవచ్చు.

కాఫీ- తేనె

కాళ్లను శుభ్రం చేయడానికి కాఫీ, తేనెను ఉపయోగించవచ్చు. కాఫీ, తేనె స్క్రబ్ కాళ్లపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. 2-3 చెంచాల కాఫీ పొడిలో చిక్కటి పేస్ట్ లా తయారవ్వడానికి సుమారు 3 చెంచాల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని కాళ్లపై రుద్దాలి. 3-4 నిమిషాల పాటు మసాజ్ చేసి, 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత కాళ్లను కడిగేస్తే.. మీ కాళ్లు కాంతివంతంగా మెరుస్తాయి.

  Last Updated: 31 Mar 2026, 03:58 PM IST