గార పట్టిన పళ్ళతో చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. గార పట్టిన పళ్ళ కారణంగా చాలామంది తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆడవాళ్లకైనా, మగవారికైనా తెల్లనే దంతాలే అందం. మనం నవ్వుతుంటే మన ముఖంలో ముందుగా కనిపించేది దంతాలే. కాబట్టి ఇవి తెల్లగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కానీ చాలా మంది దంతాలు పసుపు పచ్చగా, దంతాలపై మరకలు ఉంటాయి. ఇది వారిని మనస్ఫూర్తిగా నవ్వకుండా చేస్తుంది. అంతే కాకుండా ఈ గార పట్టిన పళ్ళ కారణంగా నలుగురి లోకి వెళ్ళాలి అన్న కూడా ఇబ్బంది పడుతుంటారు. దంతాలను సరిగ్గా తోమకపోవడం, కొన్ని వస్తువులు తినడం వల్ల దంతాలపై మురికి పేరుకుపోతుందట.
వీటితో పాటు ఇంకా అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇకపోతే పళ్ళపై ఉండే గార తొలగి పోవడానికి మార్కెట్ లో దొరికే రకరకాల టూత్ పేస్ట్ లను, పౌడర్లను వాడుతుంటారు. కానీ వీటివల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ కొన్నింటిని వాడితే మీ పళ్లు ఖచ్చితంగా తెల్లగా తలతలలాడుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిమ్మరసం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. నిమ్మరసం మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుందట. నిమ్మరసంతో పసుపు పచ్చ పళ్లను తెల్లగా చేయవచ్చట. అయితే ఇందుకోసం మీరు ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి దంతాలపై బాగా రుద్దాలట. తర్వాత గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి పుక్కిలించాలట. దీనివల్ల నోట్లోని బ్యాక్టీరియా తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే త్రిఫల చూర్ణం మనకు ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందట. ఇది దేశంలో ఏ చోటైనా దొరుకుతుందట.
త్రిఫల చూర్ణం ఉదర సంబంధిత సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట.అంతేకాదు ఇది దంత సమస్యలను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు. మీ పళ్లు పసుపు పచ్చగా ఉంటే దీనితో పళ్లు తోముకోవాలట. ఇది మీ పళ్లను తెల్లగా చేస్తుందని చెబుతున్నారు. బొగ్గు కూడా పళ్ళను తెల్లగా చేస్తుందట. పసుపు పచ్చ పళ్లు తెల్లగా కావాలంటే బొగ్గును ఉపయోగించాలని చెబుతున్నారు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావట. దంతాలపై ఉన్న పసుపు పచ్చ మరకలు పోవాలంటే మీరు ప్రతిరోజూ ఉదయాన్నే నువ్వుల నూనెతో పుక్కిలించాలట. ఇది మీ దంతాలు దృఢంగా కూడా చేస్తుందట. అలాగే తిన్న తర్వాత రాత్రిపూట ఖచ్చితంగా బ్రష్ చేయాలని, మీరు రోజుకు రెండు సార్లు అంటే ఉదయం, రాత్రిపూట పళ్లను తోముకుంటే మీ దంతాలు బలంగా ఉంటాయి. తెల్లగా కూడా ఉంటాయని చెబుతున్నారు. పైన చెప్పిన చిట్కాలు పాటిస్తే మీ పళ్ళు అందంగా మెరిసిపోవడం ఖాయం అంటున్నారు..