Foods for Upset Stomach: తల నొప్పి, కడుపు నొప్పి వంటివి సామాన్యంగా అందరికీ ఉండేవే. వయసుతో సంబంధం లేకుండా వేధించే చిన్న చిన్న సమస్యల్లో కడుపు నొప్పి ఒకటి. కడుపు నొప్పికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. అనారోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి, మలబద్ధకం, విరేచనాలు సమస్యలు వస్తాయి. కొన్ని రకాల ఆహార పదార్ధాలను తినడం ద్వారా జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి మరియు కడుపు వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉంటే దాదాపు అన్ని రకాల సమస్యలను నివారించవచ్చు.
మూంగ్ పప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. బలహీనమైన జీర్ణక్రియ కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొనే వాళ్ళు తమ ఆహారంలో మూంగ్ పప్పుతో చేసిన కిచ్డీని తీసుకుంటే ఆహారం జీర్ణం అవ్వడమే కాకుండా జీర్ణక్రియను శుభ్రపరుస్తుంది.
పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. పెరుగు ప్రోబయోటిక్. ఇది జీర్ణక్రియను కాపాడుతుంది. మీరు అజీర్ణంతో ఇబ్బంది పడుతుంటే రోజూ ఆహారంలో చివరిగా పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.
చాలా సార్లు జీర్ణ సమస్యల వల్ల చాలా బలహీనంగా అనిపిస్తుంది. అటువంటప్పుడు ఉడికించిన బంగాళాదుంపలను తినొచ్చు. అయితే దానిపై ఎటువంటి మసాలా దినుసులను యాడ్ చేయకూడదు. పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే ఉడకబెట్టిన బంగాళదుంపలో ఉప్పు కలుపుకుని తినాలి.
కొన్ని టీలు కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. దీని కోసం హెర్బల్ టీ తాగవచ్చు. ఇది వికారం తగ్గించడానికి సహాయపడుతుంది, తద్వారా జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి అల్లం టీ, చమోమిలే టీ, పుదీనా టీ లేదా ఫెన్నెల్ టీని కూడా తాగవచ్చు.
అరటిపండును చాలా మంది ఇష్టపడతారు. వీటిలో పొటాషియం మరియు పెక్టిన్ పుష్కలంగా ఉంటాయి. విరేచనాలు అయినప్పుడు అరటిపండ్లు తినాలని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది మరియు జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
Also Read: Bank Holidays in October 2023 : అక్టోబర్ నెలలో ఏకంగా 16 రోజులు బ్యాంకులకు సెలవులు..