Site icon HashtagU Telugu

Foods For Winter: చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు.. అవేంటంటే?

Foods For Winter

Foods For Winter

చలికాలం మొదలయ్యింది. నవంబర్ నుంచి ఫిబ్రవరి నెల వరకు చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. అయితే ఈ చలికాలంలో కొన్ని సీజనల్ వ్యాధులు వెంటనే వస్తూ ఉంటాయి. వాటితో పాటు చర్మానికి సంబంధించిన వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. అలాగే శీతాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. చలికాలంలో వృద్ధులే కాదు యువత కూడా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు చర్మం చాలా పొడిగా మారుతుంది. అంతే కాకుండా కొన్నిసార్లు మోకాళ్లలో నొప్పి మొదలవుతుంది. అదే సమయంలో, జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి.

అయితే వీటితో పాటు చలికాలంలో వచ్చే చాలా రకాల వ్యాధులు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని రకాల ఆహార పదార్థాలు డైట్ లో చేర్చుకోవాల్సిందే అని చెబుతున్నారు వైద్యులు. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏవి అన్న విషయానికి వస్తే.. చలికాలంలో రోటీ లేదా అన్నంలో ఒక చెంచా దేశీ నెయ్యి వేసుకుని తినాలి. ఇంట్లో తయారుచేసిన స్వచ్ఛమైన దేశీ నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కీళ్లను లూబ్రికేట్ చేయడంలో, శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు చలి నుండి రక్షించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే చలికాలంలో మనకు చిలగడదుంపలు లభిస్తూ ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపులో మంట నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. చలికాలంలో దొరికే ఉసిరికాయల వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని కూడా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రోజువారీ ఆహారంలో దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అంతేకాకుండా, చర్మం, జుట్టు కూడా అందంగా మారతాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. చలికాలంలో తీసుకోవాల్సిన వాటిలో బెల్లం ఖర్జూరం కూడా ఒకటి.

కీళ్లనొప్పులు,ఎముకలు,కీళ్లలో నొప్పితో బాధపడుతుంటే, మీ రోజువారీ ఆహారంలో బెల్లం, ఖర్జూరాన్ని చేర్చుకోవాలి. వీటిలో ఖనిజాలు, ఫైబర్ , విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఊపిరితిత్తులను కాలుష్యం నుండి రక్షించుకోవడానికి బెల్లం తినడం అత్యంత ఆరోగ్యకరమైన మార్గం. మీ రోజువారీ ఆహారంలో తప్పకుండా బెల్లాన్ని చేర్చుకోవడం మంచిది. మీ ఆహారంలో మిల్లెట్లను తప్పకుండా తినాలి. ఈ గింజల్లో పీచు సమృద్ధిగా ఉండటమే కాకుండా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇది ఇన్ఫెక్షన్‌ను నయం చేస్తుంది . అంతే కాకుండా కీళ్లను బలపరుస్తుంది. చలికాలంలో లభించే ధాన్యాలను తప్పనిసరిగా రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు. అలాగే ఆవాలను కూడా మీ డైట్ లో తరచుగా చేర్చుకోవాలని చెబుతున్నారు.