Site icon HashtagU Telugu

Health Tips: గుండె జబ్బులు దరిచేరకుండా ఉండాలంటే వీటిని తప్పకుండా తినాల్సిందే!

Health Tips

Health Tips

ఇటీవల కాలంలో గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. ఉన్నవారు ఉన్నట్టే సడన్గా చనిపోతున్నారు. ఎప్పుడూ ఏ రూపంలో వచ్చావు ముంచుకొస్తుందో తెలియక గుప్పు గుప్పుమంటూ బతుకుతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి పది మందిలో ఇద్దరు గుండెపోటుతోనే మరణిస్తున్నారు. ఈ గుండె కొట్టుకున్నంత వరకు మన శరీరానికి ప్రాణం ఉంటుంది. అందుకే గుండె విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి గుండె విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకోవాల్సిన ఆడపదార్థాలలో ఆకుకూరలు కూడా ఒకటి. ప్రతిరోజు ఆకుకూరలు తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆకుకూరలు మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీకు ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. బచ్చలికూర, పాలకూర, కాలే వంటి కూరగాయలను మీ ఆహారంలో చేర్చాలి. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఈ ఆకు కూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-కె, విటమిన్-ఎ, విటమిన్-సి, కాల్షియం వంటి అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే జీర్ణవ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటుంది. అలాగే డార్క్ చాక్లెట్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్లు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.

డార్క్ చాక్లెట్లలో ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిని తినడం వల్ల మీ మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. అయితే డార్క్ చాక్లెట్ మోతాదులో మాత్రమే తినాలని గుర్తుంచుకోండి. వాల్ నట్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇవి మన గుండెను పదిలంగా ఉంచుతాయి. అందుకే వీటిని మన రోజువారి ఆహారంలో చేర్చాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. బెర్రీలను తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఫిష్ ఆయిల్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఫిష్ ఆయిల్ కూడా మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుందట. దీన్ని క్రమం తప్పకుండా మీ ఆహారంలో పరిమిత మొత్తంలో చేర్చితే మీ గుండె ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని చెబుతున్నారు.