Site icon HashtagU Telugu

Eye Health Foods : కళ్లను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలివే.. తప్పకుండా తినండి

eye health tips

eye health tips

Eye Health Foods: మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. హెల్దీ ఫుడ్ తినాలి. అలాగే కళ్ల ఆరోగ్యం కోసం కూడా మంచి ఆహారం తినాలి. ఇంద్రియానాం నయనం ప్రధానం అంటారు కదా. కళ్లు బాగుంటే.. జీవితం కూడా బాగుంటుంది. చూపు కోల్పోతే.. సర్వం కోల్పోయినట్లే. చిన్న చిన్న పొరపాట్ల వల్ల కళ్ల ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆ తర్వాత ఎంత బాధపడినా పోయిన కంటిచూపును తిరిగి పొందలేరు. అందుకే ముందే కంటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉండేలా మంచి ఆహారాన్ని తీసుకోవాలి.

ప్రతిరోజూ ఒకేరకమైన ఆహారాన్నే కాకుండా.. అప్పుడప్పుడూ వేరువేరు ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. కంటి చూపును మెరుగు పరచుకోవడంలో చాలా రకాల ఆహారాలున్నాయి. అవేంటో చూద్దాం.

కంటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో పాలకూర బాగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్ ఎ, లుటిన్ కూడా ఉంటుంది. పాలకూర తినడం వల్ల కంటి సమస్యలు రాకుండా ఉండటంతో పాటు.. దృష్టి కూడా మెరుగ్గా ఉంటుంది.

చిలకడ దుంపలు తీసుకోవడం వల్ల కూడా కంటి చూపు బాగుంటుంది. ఈ దుంపల్లో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటిచూపును మెరుగు పరచి.. వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యల్ని తగ్గిస్తుంది. అలాగే నారింజలో విటమిన్ సి తో పాటు విటమిన్ ఏ కూడా మెండుగా ఉంటుంది. ఇది తినడం వల్ల కూడా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

ఉసిరి కూడా కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఉసిరిలో ఉండే విటమిన్ ఏ కంటికి రక్షణగా నిలుస్తుంది. క్యారెట్లు కూడా కంటి ఆరోగ్యానికి మంచిది. వీటిలో లుటిన్, బీటా కెరోటిన్ లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కంటిచూపు మెరుగై.. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

 

Exit mobile version