Weight Looss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ రోటీలను ట్రై చేయాల్సిందే?

ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు ఊబకాయం సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొందరు విపరీతమైన బరువు పెరిగి అందవిహీనంగా కూడా కనిపిస్తూ

  • Written By:
  • Publish Date - February 6, 2024 / 12:00 PM IST

ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు ఊబకాయం సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొందరు విపరీతమైన బరువు పెరిగి అందవిహీనంగా కూడా కనిపిస్తూ ఉంటారు. అలాగే అధిక బరువు ఉండేవారు తరచూ అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు. లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇక అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు తగ్గేందుకు ఎన్ని కష్టాలు పడినా కొందరైతే అస్సలు లావు తగ్గరు. వ్యాయామాలు, కసరత్తులు, జిమ్ ఇలా ఎంత కష్టపడ్డా కూడా ఫలితం మాత్రం ఉండదు. అయితే మీరు కూడా అలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారా. అయితే ఈ రోటిలను తినాల్సిందే. బరువు తగ్గడానికి చాలా మంది సాయంత్రం వేళలో భోజనం చేయకుండా చపాతీలు తింటూ ఉంటారు.

అయితే కేవలం చపాతి తింటేనే బరువు తగ్గుతారు అనుకోవడం పెద్ద పొరపాటు. చపాతి కంటే ఎన్నో ఆరోగ్యవంతమైన రోటీలు తయారు చేసుకుని తీసుకోవచ్చు. దీనిలో రాగులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలామంది రాగి పిండితో అంబలి లేదా దోశలు లాంటివి తయారుచేసుకొని తింటూ ఉంటారు. అయితే రాగి పిండితో కూడా చపాతీ తయారు చేసుకుని తీసుకోవచ్చు. దీన్ని తినడం వలన సులువుగా అధిక బరువు తగ్గడమే కాకుండా మంచి పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. అలాగే ఓట్స్ తో కూడా రోటీలను తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఓట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఓట్స్ ను కూడా పిండి పట్టించి వీటితో కూడా రోటీలను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని తిన్నట్లయితే అధిక బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

అలాగే సజ్జలతో కూడా రోటీలను తయారు చేసుకొని తీసుకోవచ్చు. ఇది కూడా ఆరోగ్యానికి మంచి పోషకాలను అందిస్తాయి. వీటితో రోటీలు తయారు చేసుకొని తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు. గోధుమపిండి చపాతీలు తిని బోర్ కొట్టిన వాళ్ళు వీటిని తయారు చేసుకుని తీసుకోవచ్చు. అదేవిధంగా జొన్నలు కూడా ఆరోగ్యానికి మంచి ఆహారం. జొన్నలతో చేసిన రైస్ కూడా తయారు చేసుకుని తింటూ ఉంటారు. పాతకాలంలో జనులతో రొట్టెలు తయారు చేసుకుని తినేవారు జొన్నలతో తయారుచేసే రొట్టెలు ఇంకా ఆరోగ్యానికి మంచిది.