Site icon HashtagU Telugu

Belly Fat: ఎలాంటి వ్యాయమం చేయకుండా పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించే డ్రింక్.. ఎలా తయారు చేయాలంటే?

Belly Fat

Belly Fat

ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక పొట్ట బెల్లీ ప్యాట్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. స్త్రీ పురుషులు చాలామంది ఈ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అలాగే పిల్లలు అయిన తర్వాత లేడీస్ కూడా పొట్ట తగ్గించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే పెద్ద పొట్టను తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్సర్సైజులు చేయడం జిమ్ కి వెళ్లడం రన్నింగ్ చేయడం, మెడిసిన్స్ వాడటం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. మీరు కూడా ఇలా బెల్లీ ఫ్యాట్, పెద్దపొట్ట సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తాగితే చాలు అని చెబుతున్నారు. ఇంతకీ ఆ డ్రింక్ ఏదో దానిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బెల్లీ ఫ్యాట్ ను కరిగించడంలో నిమ్మకాయ నీరు ఎంతో బాగా ఉపయోగపడుతుందట. నిమ్మకాయ నీరు జీవక్రియను పెంచుతుందని, జీర్ణక్రియకు సహాయపడుతుందని చెబుతున్నారు. శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పంపుతుందట. అలాగే బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుందట. బెల్లీ ఫ్యాట్ ని కూడా కరిగిస్తుందట. కీరదోసకాయ నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయట. శరీరాన్ని కూడా హైడ్రేట్ చేస్తుందట. మంటను కూడా తగ్గిస్తుందని, ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు మద్దతు ఇస్తుందని, బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అల్లం నీరు కూడా ఇందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇది జీవ క్రియను పెంచుతుంది. కొవ్వును ఈజీగా తగ్గిస్తుంది. బెల్లీ ఫ్యాట్ ను కలిగించడంలో యాపిల్ సైడర్ వాటర్ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందట.

ఆపిల్ సైడర్ వెనిగర్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందట. ఇది శరీర కొవ్వును తగ్గిస్తుందని, ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుందని, అలాగే బరువు తగ్గించి బెల్లీ ఫ్యాట్ ని తగ్గిస్తుందని చెబుతున్నారు. జీర్ణ సమస్యల నుండి ఉపశమనానికి, ఉబ్బరం, గ్యాస్‌ ను తగ్గించడానికి ఉత్తమమైనదిగా చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను ప్రేరేపిస్తుందట. బెల్లీ ఫ్యాట్ ని ఈజీగా కరిగించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. పుచ్చకాయ నీరు కూడా అధిక పొట్టను తగ్గిస్తుందట. అలాగే శరీరాన్ని హైడ్రేట్ చేస్తుందట. ఇది సహజ యాంటీ ఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంటుందని, శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పంపడంలో సహాయపడుతుందని, బరువు తగ్గడానికి నడుము సన్నగా మారడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. దాల్చిన చెక్క నీరు కూడా ఇందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుందట. అలాగే ఈ నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శక్తివంతమైన ఔషధం, జీవక్రియను పెంచుతుందట. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ ని కరిగించడంలో ఎక్కువగా సహాయపడుతుందని చెబుతున్నారు.