Site icon HashtagU Telugu

Worlds 1st Surgery To Right Heart : కుడి గుండెకు కీహోల్  సర్జరీ.. ఇండియా డాక్టర్ల వరల్డ్ రికార్డ్

Worlds 1st Surgery To Right Heart

Worlds 1st Surgery To Right Heart

Worlds 1st Surgery To Right Heart : మన శరీరంలో గుండె ఎటువైపు ఉంటుంది ? 

“ఎడమ వైపు” ఉంటుంది అనే ఆన్సర్.. సరైంది !!

కానీ కొందరికి “కుడివైపు” కూడా  గుండె ఉంటుంది!! 

ఈ విచిత్రమైన ఆరోగ్య సమస్యను డెక్స్‌ట్రోకార్డియా (Dextrocardia)  అంటారు. 

ఈ అరుదైన ప్రాబ్లమ్ ప్రతి 10,000 మందిలో ఒకరికి మాత్రమే పుట్టుకతో వస్తుంటుంది. 

Also read : Smallest Airport: భారతదేశంలో అతి చిన్న విమానాశ్రయం ఇదే.. ఎక్కడ ఉందంటే..?

డెక్స్‌ట్రోకార్డియా కారణంగా కరోనరీ ఆర్టరీ వ్యాధి (CAD)తో బాధపడుతున్న బంగ్లాదేశ్ వ్యక్తి 47 ఏళ్ళ యేషిన్ భుయాన్ కు బెంగుళూరులోని నారాయణ హెల్త్ సిటీ వైద్య నిపుణులు సక్సెస్ ఫుల్ గా కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ (CABG) చేశారు. అతడికి కుడివైపు గుండె ఉన్నందున.. ఛాతీకి  కుడి వైపున 5 సెంటీమీటర్ల  చిన్న కోత చేయడం ద్వారా ఈ సర్జరీ నిర్వహించారు. ఎటువంటి ఎముక కోతలు లేకుండానే.. పక్కటెముకల మీదుగా గుండెను యాక్సెస్ చేసి ఈ సర్జరీని వైద్యులు పూర్తి చేశారు.

Also read : Pawan Arrest Notice : BJP డైరెక్ష‌న్లో YCP, జ‌న‌సేన పొలిటిక‌ల్ డ్రామా

కుడివైపు గుండెను  కలిగిన వారికి కీహోల్  సర్జరీ చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. దీంతో కుడి వైపునున్న అతడి గుండెకు రక్తాన్ని సరఫరా చేయడానికి కరోనరీ ధమనులు ఇన్నాళ్లు  పడిన కష్టానికి తెరపడింది. భూయాన్‌ కు ఈ  సర్జరీ చేశాక.. నాలుగు గంటల్లోనే వెంటిలేటర్ నుంచి  తొలగించారు.  ఐదు రోజుల్లోనే డిశ్చార్జ్ కూడా  చేశారు.