Site icon HashtagU Telugu

Sleeping: మధ్యాహ్న సమయంలో నిద్రపోవడం వల్ల కలిగే లాభాలు ఇవే?

Afternoon Sleep

Afternoon Sleep

మనిషికి నిద్ర అన్నది చాలా అవసరం. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి కంటినిండా నిద్రపోక లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాడు. సరిగా నిద్రపోకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అన్న విషయం తెలిసిందే.. రాత్రి సమయంలో ఖచ్చితంగా ఎనిమిది గంటలు నిద్రపోవాలి. అలా అని ఉదయం ఏడు ఎనిమిది వరకు పడుకోవడం మంచిది కాదు. కానీ స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోవడంతో చాలామంది అర్థరాత్రి వరకు మొబైల్ ఫోన్లో కాలక్షేపం చేస్తూ అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

అయితే ఉద్యోగాలు చేసేవారికి అలాగే పొలం పనులకు వెళ్లిన మధ్యాహ్న సమయంలో భోజనం చేసిన తర్వాత కాస్త నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్న వారికి కూడా మధ్యాహ్న సమయంలో నిద్ర వచ్చినట్టు అనిపించినా కూడా అలా నిద్రపోతే బరువు పెరుగుతానేమో అని కొందరు భయపడి నిద్రపోకుండా అలాగే ఉంటారు. అది కేవలం ఒట్టి అపోహ మాత్రమే. మధ్యాహ్నం సమయంలో కొద్దిసేపు నిద్రపోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మధ్యాహ్నం ఒక గంట నిద్రపోవడం వల్ల రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.

మైండ్ కూడా బాగా పనిచేస్తుంది. హై బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది. మధ్యాహ్నం పూట నిద్రపోయే వారికి కొలెస్ట్రాల్ సమస్యలు కూడా ఉండవు. గుండె సంబంధిత రోగాలు కూడా ద‌రిచేర‌వు. మధ్యాహ్న సమయంలో పడుకోవడం వల్ల ఒంట్లో కొవ్వు కరిగిపోతుంది. కొవ్వుని క‌రిగించేందుకు ఈ మ‌ధ్యాహ్న నిద్ర బాగా ప‌నిచేస్తుంది. దాంతో వ‌ల్ల షుగ‌ర్‌, థైరాయిడ్ వంటి స‌మ‌స్య‌లు కూడా అదుపులోకి వ‌స్తాయి.