Site icon HashtagU Telugu

Tulasi Leaves: రోజు ఖాళీ కడుపుతో తులసి 4ఆకులను తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Tulasi Leaves

Tulasi Leaves

హిందువులు ఎంతో పరమపవిత్రంగా భావించే తులసి మొక్క వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. వాస్తు పరంగానే కాకుండా ఆర్థిక పరంగా ఆరోగ్యకరంగా కూడా తులసి మొక్క ఉపయోగపడుతుంది. తులసి మొక్కను ఎన్నో ఔషధాలు తయారీలో ఉపయోగిస్తారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే తులసి మొక్కను కొన్ని దేవుళ్ళు పూజలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అంతే కాకుండా ఆర్థికంగా తులసి మొక్క ఇంట్లో పెంచుకోవడం వల్ల తులసి మొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి, విష్ణు అనుగ్రహం కూడా కలుగుతుంది.

తులసి మొక్కను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే తులసి మొక్కను ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. తులసి తీర్థాన్ని ఆలయాల్లో ఇవ్వడానికి ప్రధాన కారణం సర్వరోగ నివారిణిగా పనిచేయడమే. ఇక తులసి ఆకులను నమిలి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.నోటి దుర్వాసన తొలగిపోతుంది. నోట్లో ఫంగల్, ఇన్‌ఫెక్షన్లు కూడా దూరం అవుతాయి. మరి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నాలుగు తులసి ఆకులను నమిలి తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 4 తులసి ఆకులను నమిలి తింటే నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు. ఒత్తిడి కూడా తొలగిపోతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించే కార్టీ సోల్‌ను నయం చేయడానికి తులసి ఆకులు చాలా బాగా ఉపయోగపడుతాయి. నిత్యం 12 తులసి ఆకులు తింటే తలనొప్పి, మైగ్రేన్ వంటివి కూడా దూరం అవుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జలుబు, తలనొప్పి, అలర్జీ, సైనస్ లాంటి వాటికి గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా వాతావరణం మారిన క్రమంలో గొంతునొప్పి వంటి వ్యాధులు వస్తుంటాయి. అప్పుడు తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది.

Exit mobile version