Site icon HashtagU Telugu

White Onion: ఎండాకాలంలో తెల్ల ఉల్లిపాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

Mixcollage 04 Feb 2024 08 02 Am 4214

Mixcollage 04 Feb 2024 08 02 Am 4214

వేసవికాలం వచ్చింది అంటే పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో మనం తీసుకునే ఆహార పదార్థాలలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు. అయితే వేసవిలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో తెల్ల ఉల్లిపాయ కూడా ఒకటి. మరి వేసవిలో తెల్ల ఉల్లిపాయ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటూ ఉంటారు. ఉల్లిపాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మామూలుగా మనం ఎర్ర ఉల్లిపాయలు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాము..

తెల్ల ఉల్లిపాయను చాలా తక్కువగా వినియోగిస్తూ ఉంటాం. అంతేకాకుండా తెల్ల ఉల్లిపాయలు మార్కెట్లో తక్కువగా లభిస్తూ ఉంటాయి. మరి తెల్ల ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల వేసవిలో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. తెల్ల ఉల్లిపాయలు జీవక్రియ, జీర్ణక్రియ మరియు శరీరం నిర్విషీకరణను మెరుగుపరచడానికి ఉబ్బరం, అజీర్ణం లాంటి ఆరోగ్య సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. శుభ్రమైన సమతుల్య గట్ రోగనిరోధక శక్తి నిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తెల్ల ఉల్లిపాయ శరీరాన్ని చల్లబరచడానికి రాత్రి పూట చెమటలు పట్టటానికి కూడా సహాయపడుతుంది.

తెల్ల ఉల్లిపాయను ఏమైనా సలాడ్ లో కానీ రోటీ లో కలిపి తీసుకోవచ్చు. తెల్ల ఉల్లిపాయను రాత్రి ఆహారంలో భాగం చేసుకుంటే ఇంకా మంచిది. అదే విధంగా రోజు ఒక రెండు తెల్ల ఉల్లిపాయలను డైరెక్ట్ గా తీసుకున్న కానీ ఇబ్బంది ఏమి లేదు. రోజు వారి వంటల్లో కూడా తెల్ల ఉల్లిపాయలను చేర్చుకొని ఈ వేసవి తాపం నుండి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు. ఉల్లిపాయను నేరుగా తీసుకోవడానికి ఇష్టపడని వారు కూరల రూపంలో అయినా తీసుకోవచ్చు.