మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరానికి అనేక రకాల విటమిన్లు తప్పనిసరి. అందులో విటమిన్ సి కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. విటమిన్ సి మనకు నిమ్మకాయ బత్తాయి లాంటి పదార్థాలలో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. శరీరానికి తగినంత విటమిన్ సి లేకపోతే కూడా అనేక రకాల సమస్యలు వస్తాయి. అయితే విటమిన్ సి వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. విటమిన్-సి అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు అతిగా తీసుకోవాల్సి ఉంటుంది.
విటమిన్-సి నీటిలో సులభంగా కరుగుతుంది. కాబట్టి ఇది అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఐరన్‌తో పాటు విటమిన్-సి అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకుంటే చర్మం, జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటే తప్పకుండా విటమిన్ సి అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
అంతేకాకుండా ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపం నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో విటమిన్లు లేకపోవడం వల్ల తీవ్రమైన వ్యాధులకు దారి తీయవచ్చు. విటమిన్ సి లోపం ఉంటే రోగనిరోధక వ్యవస్థపై కూడా చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా విటమిన్ సి అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ సి లో అద్భుతమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. విటమిన్ సి కలిగిన పండ్లు, కూరగాయలను తింటే యాంటీఏజింగ్ సప్లిమెంట్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యల నుంచేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.