Site icon HashtagU Telugu

Tomato peel: టమోటో తొక్కతో ఇన్ని రకాల ప్రయోజనాలా.. అవేంటంటే?

Tomato Prices

Tomato Peel

మన వంటింట్లో దొరికే కాయగూరలలో ఒకటైన టమోటా గురించి టమోటా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. టమోటా ను చాలా వరకు అనేక వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల కూరలు చేసినప్పుడు టమోటా తొక్క తీసేసి వంట చేస్తూ ఉంటారు. అయితే కేవలం టమోటా వల్ల మాత్రమే కాకుండా టమోటా తొక్క వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి టమోటా తొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. టమోటా తొక్కలో అనేక రకాల విటమిన్ లు పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

టమోటో తొక్కలు చర్మ రంద్రాలు బ్లాక్ హెడ్స్ ను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇందుకోసం టమోటా తొక్కలను ఎండబెట్టి తర్వాత పొడి చేసి దానిని రోజ్ వాటర్ లో లేదంటే సాధారణ నీటిలో పేస్టులా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ఫేస్ మీద గ్లో వస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మంపై జిడ్డు తొలగిపోయి చర్మం నివారిస్తుంది. అలాగే ఆయిల్ స్కిన్ తో బాధపడేవారు టమోటా తొక్కలను ముఖంపై బాగా రుద్ది పది నుంచి 15 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో కలియడం వల్ల ముఖం బాగా ఫ్రెష్ గా ఉంటుంది. కేవలం అందానికి మాత్రమే కాకుండా టమోటా తొక్కలను ఉపయోగించి సూప్ శాస లాంటివి కూడా తయారు చేసుకోవచ్చు.

ఇందుకోసం టమోటో తొక్కలని ఎండబెట్టి, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ లాగా చేసి దానిని సూప్ లేదా సాస్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే వంటింట్లో ఆడవాళ్లు తుప్పు పట్టిన సామాన్లను శుభ్రం చేయడానికి ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. అటువంటి అప్పుడు తుప్పు పట్టిన సామాన్లను శుభ్రం చేయడంలో టమోటా తొక్క ఎంతో బాగా ఉపయోగపడుతుంది. టమోటా తొక్కలను మరకలు ఉన్న ప్రదేశంలో రుద్ది కావాలంటే దానికి కొద్దిగా బేకింగ్ సోడా అని కూడా కలపవచ్చు. అది తుప్పు పట్టడం వదిలించడం లాంటివి చేస్తుంది.

Exit mobile version