Site icon HashtagU Telugu

Fish Oil: ఫిష్ ఆయిల్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా…?

Fish Oil

Fish Oil

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చిన్న వయసులోనే చాలా మందికి జుట్టు తెల్లబడుతుంది. అయితే ఈ సమస్యను నివారించేందుకు ఎన్నో సహజమైన మార్గాలు ఉన్నాయి. తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకునేందుకు ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.

ఫిష్ ఆయిల్ :
ఫిష్ ఆయిల్ ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.. ఇది జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది. చేప నూనె క్యాప్యూల్స్ కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. చేపనూనెను జుట్టుకు రాసి మెల్లిగా మర్దన చేయాలి. అలా మర్దన చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది.

కావాల్సిన పదార్థాలు :
ఆలివ్ నూనె – 2 టేబుల్ స్పూన్లు
చేప నూనె లేదా క్యాప్సూల్ – 2 టేబుల్ స్పూన్లు
అలోవెరా జెల్ – 2 టేబుల్ స్పూన్లు

ఒక గిన్నెలో పైన చెప్పినవన్నీ వేసి సమానంగా కలపాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లే చేసే ముందు.. తలస్నానం చేసి జుట్టు పొడిబారేలా చేయాలి. జుట్టు కుదుళ్ల నుంచి చేపనూనె రాసి మసాజ్ చేయాలి. అలా 5 నుంచి 7 నిమిషాల వరకు మసాజ్ చేసి..అరగంట తర్వాత తలస్నానం చేయాలి. షాంపూ, కండీషనర్ తో జుట్టును శుభ్రపరుచుకోవాలి.

ఫిష్ ఆయిల్ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు..

1. జుట్టుకు ఎదుగుదలతోపాటు, ఆరోగ్యవంతంగా మార్చేందుకు సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా జుట్టు తెల్లగా మారకుండా చేస్తుంది.

2. ఫిష్ ఆయిల్ లో పోషకాలు, ప్రొటీన్లతో నిండిన ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది మీ జుట్టు లోపలి నుంచి మంచి ఎదుగుదల లభించేలా చేస్తుంది.

3. జుట్టు మూలాలు, చర్మానికి అవసరమైన ప్రొటీన్లు, పోషకాలను ఈ నూనె అందిస్తుంది. దీంతో తలకు రక్తప్రసరణ సరిగ్గా జరిగి జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది.

Exit mobile version