Sweat : చెమటలు పట్టాలి.. చెమట పట్టడం వలన కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా?

చెమట పట్టడం వల్ల చాలా మంది చిరాకు పడుతుంటారు. కానీ చెమట పట్టడం అనేది మన ఆరోగ్యానికి మంచిది.

  • Written By:
  • Publish Date - May 24, 2024 / 08:00 PM IST

Sweat : చెమట పట్టడం వల్ల చాలా మంది చిరాకు పడుతుంటారు. కానీ చెమట పట్టడం అనేది మన ఆరోగ్యానికి మంచిది. చెమట అనేది మన చర్మం పైన ఉన్న స్వేద గ్రంధుల ద్వారా బయటకు వస్తుంది. దీని వలన శరీరంలోని వేడి తగ్గుతుంది. వేడిగా ఉండే ప్రదేశాలలో నివసించే వారికి చెమట ఎక్కువగా పడుతుంది. చెమట ద్వారా మన శరీరంలోని ద్రవాలన్నీ బయటకు పోతాయి. కాబట్టి వేడిగా ఉండే ప్రాంతాలలో ఉండేవారు మంచినీళ్ళు కూడా ఎక్కువగా తాగాలి.

వ్యాయామం చేసినప్పుడు కూడా చెమట ఎక్కువగా పడుతుంది. దీని వలన చర్మం సహజమైన మెరుపును తెచ్చుకుంటుంది. వ్యాయామం చేయడం వలన మన శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఏదయినా పని చేసినప్పుడు మనకు బాగా చెమటలు పడుతున్నాయి అంటే మన గుండెకు మేలు జరుగుతుంది. చెమట వలన శరీరంలోని వ్యర్ధాలు అన్నీ బయటకు పోతాయి. చెమటలు ఎక్కువగా పడితే మొటిమలు, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.

కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం అనేది ఈ రోజుల్లో చాలా మందికి జరుగుతుంది. కానీ ఎవరికి అయితే ఎక్కువగా చెమటలు పడతాయో వారికి కిడ్నీలో రాళ్ళు అంత తొందరగా ఏర్పడవు. ఎందుకంటే మన శరీరంలో ఉప్పు లేదా కాల్షియం ఉంటేనే రాళ్ళు ఏర్పడతాయి. కానీ చెమట పట్టడం వలన మన శరీరంలో ఉండే ఉప్పు చెమట ద్వారా బయటకు పోతుంది. కాబట్టి ఎక్కువగా చెమటలు పడుతున్నాయి అని అనుకునేవారు బాధ పడనవసరం లేదు. చెమట పట్టడం కూడా మన ఆరోగ్యానికి మంచిదే.

 

Also Read : Water After Meal : భోజనం చేసిన వెంటనే నీళ్లెందుకు తాగకూడదు?