Spirulina: బరువు తగ్గడం కోసం ఉపయోగించే ఈ మొక్క గురించి మీకు తెలుసా?

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది అధిక బరువు సమస్యతో

Published By: HashtagU Telugu Desk
Spirulina

Spirulina

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో అధిక బరువు అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. దీంతో చాలా లావు ఉన్నవారు బరువు తగ్గడం కోసం అనేక రకాల టిప్స్ ని ఫాలో అవుతున్నారు. కొంతమంది లావు తగ్గడానికి తినకుండా డైటింగ్ చేస్తుంటే, మరి కొంతమంది ఎక్సర్ సైజు లు జిమ్ములకు వెళ్లి వారి బాడీ ని తగ్గించుకోవడానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ రిజల్ట్ కనిపించకపోయేసరికి చాలామంది నిరాశ వ్యక్తం చేస్తూ ఉంటారు.

అయితే బరువు తగ్గడం కోసం సహజంగా ఒక మొక్కను ఉపయోగిస్తారు. ఆ మొక్క పేరు స్పిరులినా. ఈ మొక్క నాచు జాతికి చెందిన ఒక నీటి మొక్క. ఈ మొక్కను ఆదిమానవులు ఆహారంలో భాగంగా తీసుకునేవారు అని చెబుతూ ఉంటారు. అంతే కాకుండా చారిత్రికంగా వేల సంవత్సరాల నుంచి వాడుకలో నాచు మొక్కను ఆహార వనరుగా ఉపయోగపడుతూనే ఉందట. ఇప్పటికి కూడా అనేక దేశాల ప్రజలు వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకుంటున్నారు. ఆఫ్రికా లాంటి దేశాలలో కరువు కాటకాలు నెలకొన్న సందర్భాలలో అక్కడి ప్రజలు వారికి అవసరమైన పోషకాలు కోసం ప్రధానంగా ఈ స్పిరులినా అనే మొక్క పై ఆధారపడతారట.

ఈ మొక్క బరువును తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. నీటిలో దొరికే ఈ మొక్క ఆకులను పొడి చేసుకుని నిత్యం కొంచెం మోతాదులో తీసుకోవడం వల్ల బరువుని ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ మొక్కను తీసుకున్న తర్వాత మరే ఇతర పోషకాహారం చేసుకోవాల్సిన పనిలేదు. తల్లిపాలలో ఉన్న పోషకాలు ఈ మొక్కలు మనకు ఉంటాయి. అంతే కాకుండా ఈ స్పిరులినా మొక్కపొడిలో కాల్షియం సాధారణ పాలలో కంటే 26 రెట్లు అధికంగా ఉంటుందట. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు కూడా గట్టిగా మారుతాయి.

  Last Updated: 10 Oct 2022, 07:03 PM IST