బాదంపప్పు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ బాదంపప్పును కొందరు నేరుగా తింటే మరి కొందరు నీటిలో నానబెట్టుకొని తింటూ ఉంటారు. రాత్రిళ్ళు నీటిలో నానబెట్టుకొని ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత వాటిని తింటూ ఉంటారు. స్త్రీలు కూడా ఈ నానబెట్టిన బాదం పప్పులను తింటూ ఉంటారు. అయితే స్త్రీలు ఈ నానపెట్టిన బాదం పప్పులను ప్రతిరోజు తినవచ్చా తినకూడదా? ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బాదంలో ప్రోటీన్, ఆమ్లాలు 3 కొవ్వు,జింక్, ఒమేగా విటమిన్ ఎ, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇందులో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మెదడు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా తినే బాదంలో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందట. వాస్తవానికి బాదం పప్పు పై పొరను జీర్ణించుకోవడం కష్టం. అందుకే వీటిని తీసేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. బాదం పప్పులను నానబెట్టి తింటే జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుందట. అవి కూడా సులభంగా జీర్ణమవుతాయి. బాదంను నీటిలో నానబెట్టడం వల్ల దానిలోని ఫైటిక్ ఆమ్లం తగ్గుతుందట. అలాగే దీనిలోని పోషకాహార స్థాయి పెరుగుతుందని, నానబెట్టిన బాదం ఒక లిపిడ్ బ్రేకింగ్ ఎంజైమ్ ను విడుదల చేస్తుందని ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందని చెబుతున్నారు.
పీసీఓఎస్ సమస్యతో సతమతమవుతుంటే తప్పకుండా నానబెట్టిన బాదం పప్పులను తినడం మంచిది. పీరియడ్స్ ప్రారంభానికి 10 రోజుల ముందు నానబెట్టిన బాదం పప్పులను రోజూ తినాలి. ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్యను పోగొడుతుందట. నిజానికి హార్మోన్ల అసమతుల్యత వల్ల పీసీఓఎస్ సమస్య పెరుగుతుందని, ఇలాంటి పరిస్థితిలో నానబెట్టిన బాదం హార్మోన్ల సమతుల్యతకు సహాయపడతాయని చెబుతున్నారు. బాదంలో పొటాషియం, మెగ్నీషియం, మొక్కల ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఒకవేళ మీరు హార్ట్ పేషెంట్ అయితే ఈ పోషకం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజూ రాత్రి పూట నానబెట్టిన బాదం పప్పులను ఉదయం తింటే ఎల్ డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే తక్కువ కేలరీలు కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయట. బాదం పప్పులో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని చెబుతున్నారు. నానబెట్టిన బాదం గింజలు తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందట. మతిమరుపు సమస్య తగ్గుతుందని చెబుతున్నారు. దీనిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయని, దీన్ని రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రిస్క్ తగ్గుతుందని, ఇది రక్త కణాలను రిపేర్ చేయడమే కాకుండా, ఎముకలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు.