Site icon HashtagU Telugu

Papaya: బొప్పాయి తింటే బరువు పెరుగుతారా.. ఇందులో నిజమెంత!

Papaya

Papaya

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.. తరచుగా బొప్పాయిని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అంతేకాకుండా బొప్పాయి పలు రకాల అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ పండులో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఇ, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్స్ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే నిజానికి బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది.

బొప్పాయి పండును తినడం వల్ల మీ ఆకలి నియంత్రణలో ఉంటుంది. అలాగే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు. కానీ బొప్పాయి తింటే బరువు పెరుగుతారు అన్నది ఒట్టి అపోహ మాత్రమే అని చెబుతున్నారు. బొప్పాయిని డైట్ లో చేర్చుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి పుష్కలంగా ఉండే బొప్పాయిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందట. ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బొప్పాయిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందట.

బొప్పాయిలో షుగర్ తక్కువగా ఉంటుంది. కానీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుందట. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ బొప్పాయి తినవచ్చు. విటమిన్ కె పుష్కలంగా ఉండే బొప్పాయి ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉండే బొప్పాయి కూడా చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.