మామూలుగా చాలా మందికి పగలు సమయంలో పడుకోవడం అలవాటు. కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా పగలు సమయం నిద్రపోరు. అయితే పగలు సమయం పడుకోవడం కొందరు మంచిది కాదు అంటే ఇంకొందరు మంచిది అని వాదిస్తూ ఉంటారు. పగలు పూట పడుకుంటే రాత్రి నిద్ర రాదని దీనివల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయని కొందరు అంటూ ఉంటారు. దీంతోపాటు అనేక రకాల సమస్యలను వస్తాయని అంటూ ఉంటారు. అసలు పగటి పూట పడుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నిద్ర అనేది మనుషులకు చాలా అవసరం. ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం. నిద్రలో మన శరీరం, మెదడు పునరుజ్జీవనం పొందుతాయి. ఇది మన జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను అలాగే రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందట. అయితే చాలామంది పగటి పూట నిద్రిస్తే, ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతుంటారు. కానీ వైద్యులు మాత్రం పగటి పూట నిద్ర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తోందని చెబుతున్నారు. పగటి పూట పడుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందట. పగటిపూట కొద్దిసేపు నిద్రపోతే మెదడు చురుగ్గా పనిచేస్తుందట. పగటిపూట నిద్రపోవడం వల్ల రక్తపోటు తగ్గుతుందట. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందట. మధ్యాహ్నం కాసేపు నిద్రపోతే శరీరం, మనస్సు రిఫ్రెష్ అవుతాయట. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.
పగటిపూట ఎక్కువసేపు నిద్రపోతే రాత్రి నిద్ర పట్టకపోవచ్చు. పగటిపూట అతిగా నిద్రపోవడం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ప్గటిపూట నిద్రపోవడం వల్ల పనిపై శ్రద్ధ తగ్గుతుందట. నిత్యం పగటిపూట నిద్రించేవారిలో మధుమేహం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అసలు పగటిపూట ఎంతసేపు నిద్రపోతే మంచిది అన్న విషయానికి వస్తే… పగటి పూట 20 నుంచి 30 నిమిషాల పాటు నిద్రపోవడం మంచిదని ఎక్కువసేపు నిద్రపోతే రాత్రిళ్ళు నిద్రకు ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య నిద్రపోవడం మంచిదని చెబుతున్నారు. ఎవరు నిద్రపోకూడదు అన్న విషయానికి వస్తే.. రాత్రిపూట నిద్రలేమి సమస్య ఉన్నవారు అలాగే, రాత్రిపూట షిఫ్ట్ లో పనిచేసేవారు పడుకోకూడదట.