Jasmine Tea : మల్లె పూలతో టీ చేసుకుంటారు తెలుసా?? ఆరోగ్యానికి ఎంత మంచిదో..

మల్లె పూలు తలలో పెట్టుకోవడానికి మాత్రమే కాదు మన ఆరోగ్యానికి(Health) కూడా చాలా మంచివి. మల్లె పూలతో టీ తయారు చేసుకొని తాగితే మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

  • Written By:
  • Publish Date - May 16, 2023 / 06:00 PM IST

ఎండాకాలం(Summer) రాగానే అందరికీ గుర్తుకు వచ్చే పూలు మల్లె పూలు(Jasmine). వీటితో ఎండాకాలంలో అందరూ పూలజడలు వేయించుకుంటారు. అయితే మల్లె పూలు తలలో పెట్టుకోవడానికి మాత్రమే కాదు మన ఆరోగ్యానికి(Health) కూడా చాలా మంచివి. ఎలా అంటే మల్లె పూలతో టీ తయారు చేసుకొని తాగితే మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఎండాకాలంలో చల్లని పదార్థాలు ఎక్కువగా తాగడం వలన కలిగే దంత(Teeth) సమస్యలు తగ్గడానికి మల్లె పూలతో చేసిన టీ(Tea)ని నోటిలో వేసుకొని పుక్కిలించుకోవాలి. ఇలా చేయడం వలన దంత సమస్యలు తగ్గడంతో పాటు నోటి దుర్వాసన ఉన్నా కూడా పోతుంది.

మల్లె టీ తయారీకి కావలసిన పదార్థాలు:-
* నీరు ఒక కప్పు
* గ్రీన్ టీ పొడి ఒక స్పూన్
* తేనె ఒక స్పూన్
* మల్లె పూలు నాలుగు తాజావి.

పొయ్యి మీద ఒక గిన్నెలో నీటిని వేసి మరిగించుకోవాలి. నీరు మరిగిన తరువాత టీ పొడి, మల్లె పూలు వేసి మరిగించాలి. ఒక కప్పులో తేనెను వేసుకొని ఉంచుకోవాలి. తేనె వేసుకొని ఉంచుకున్న కప్పులో మరిగిన టీని వడగట్టుకొని బాగా కలుపుకోవాలి. అంతే మనకు కావలసిన మల్లె పూల టీ రెడీ. ఇది ఆరోగ్యానికి మంచిది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి కచ్చితంగా ఈ ఎండాకాలంలో మల్లె టీ తయారుచేసుకొని తాగండి.

 

Also  Read :  100 Hours Cooking : ఆమె అన్ స్టాపబుల్.. 100 గంటలు నాన్‌స్టాప్‌ కుకింగ్