Site icon HashtagU Telugu

Pink Salt Benefits: పింక్ సాల్ట్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Pink Slat

Pink Slat

చాలా వరకు మనం ఇళ్లలో వాడే ఉప్పు తెలుపు రంగులో ఉంటుంది. చిన్న ఉప్పు లేదా రాళ్ళ ఉప్పు ఇవి రెండూ కూడా తెల్ల రంగులోనే ఉంటాయి. వీటికి బదులుగా అంటే చాలామంది పింక్ సాల్ట్ ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని హిమాలయన్ సాల్ట్ అని కూడా పిలుస్తారు. ఇది గులాబీ రంగులో ఉంటుంది. ఈ పింక్ సాల్ట్ సాధారణ ఉప్పుతో పోల్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ పింక్ సాల్ట్ వల్ల కలిగి లాభాలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు. మరి పింక్ సాల్ట్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే..

పింక్ సాల్ట్ ఉప్పులో ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. టేబుల్ ఉప్పు కంటే ఎక్కువ కాల్షియం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం ఈ పింక్‌ సాల్ట్‌ లో ఉంటాయట. ఈ రాతి ఉప్పు జీర్ణ ఎంజైమ్లను సక్రియం చేయడానికి సహాయపడుతుందట. అలాగే ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుందని చెబుతున్నారు. పింక్ ఉప్పు జీర్ణక్రియ కోసం ద్రవ ఉత్పత్తిని ప్రేరేపిస్తుందట. అవసరమైన పోషకాలను బాగా గ్రహించడానికి, కొవ్వు నిల్వను నివారించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. వెచ్చని నీటితో కలిపినప్పుడు, పింక్ ఉప్పు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహిస్తుందట. ఇది నిర్జలీకరణం, అలసటను నివారిస్తుందట.

ఇది తరచుగా బరువు పెరగడంతో సంబంధం కలిగి ఉంటుందట. పింక్‌ సాల్ట్‌ లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంతో సహా 84 ఖనిజాలు ఉంటాయట. ఈ రకమైన ఉప్పులోని ఖనిజాలు శరీరం నుండి విషాన్ని బయటకు పంపి ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడతాయని, ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. అలాగే హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌ అని పిలిచే ఈ ఉప్పులోని మెగ్నీషియం కంటెంట్ కండరాలు, నరాలను సడలించడానికి సహాయపడుతుందట. నిద్ర నాణ్యతను కూడా ఇది పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.