Grapes: ద్రాక్షపండ్లతో ఆ వ్యాధులను సులభంగా నయం చేసుకోవచ్చు?

మార్కెట్లో దొరికే పండ్లలో కొన్ని రకాల పండ్లు మనకు కొన్ని సీజన్లో మాత్రమే లభిస్తూ ఉంటాయి. అటువంటి వాటిలో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి. ఈ మధ్యకాలం

  • Written By:
  • Publish Date - May 28, 2023 / 07:45 PM IST

మార్కెట్లో దొరికే పండ్లలో కొన్ని రకాల పండ్లు మనకు కొన్ని సీజన్లో మాత్రమే లభిస్తూ ఉంటాయి. అటువంటి వాటిలో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి. ఈ మధ్యకాలంలో చాలావరకు ఏడాది ఇప్పుడు ఉన్న ఈ ద్రాక్ష పండ్లు మనకు దొరుకుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ ద్రాక్ష పండ్లను వేసవికాలంలో తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో ప్రతిరోజు తినడం వల్ల ఎండాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారు.

ఇలాంటి ఒత్తిడి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ద్రాక్ష పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఇంకా ద్రాక్ష వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రొటీన్లతో పాటు విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. అంతేకాకుండా ద్రాక్షలో గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షిస్తాయి. టీబీ, క్యాన్సర్‌, బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వంటి వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రతి రోజూ ఎండు ద్రాక్షలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, పసుపు, గులాబీ ద్రాక్షలు లభిస్తున్నాయి. ఇవి తినడం వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆకుపచ్చ ద్రాక్ష తినడం వల్ల టిబి, క్యాన్సర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే గుణాలు ముఖంపై మెరుపును కూడా తీసుకువస్తాయి. ద్రాక్షలో పొటాషియం, విటమిన్-బి లభిస్తుంది. కాబట్టి ఎముకలను దృఢంగా ఉంచేందుకు సహాయపడుతుంది.