అంజీర్ పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ పండును కొందరు పండుగ తింటే మరికొందరు డ్రైఫ్రూట్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. ఇందులో విటమిన్ ఏ,విటమిన్బి, విటమిన్ ఈ ఫైబర్,క్యాల్షియం,విటమిన్ కె, పొటాషియం,ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి. డ్రై అంజీర్ వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. డ్రై అంజీర పండ్లను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే మీరు బోలెడు లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు. నానబెట్టిన అంజీర పండ్లే కాదు దాని వాటర్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట.
మీరు ఉదయాన్నే అంజీర వాటర్ ను తాగితే గుండె ఆరోగ్యంగా ఉండటం నుంచి బీపీ తగ్గడం వరకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు.. మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటుందట. అయితే మీ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి ఉదయాన్నే పరిగడుపున అంజీర వాటర్ ను తాగడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. నిజానికి అంజీర పండ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుందట. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుందని ఈ వాటర్ ను తాగితే మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నానబెట్టిన అత్తి పండ్లను మీరు ఉదయాన్నే పరిగడుపున తింటే మీ శరీరానికి మంచి శక్తి అందుతుందట. ఇది మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుందని, మీ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుందని చెప్తున్నారు. అలాగే అధిక రక్తపోటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. ఇది గుండె పోటుకు దారితీస్తుందట. అయితే మీరు ఉదయాన్నే పరిగడుపున అంజీర నీళ్లను తాగితే అధిక రక్తపోటు అదుపులో ఉంటుందట. అంజీర పండ్ల వాటర్ మీ బరువును తగ్గించడానికి కూడా బాగా సహాయపడతాయట. ఈ అంజీర వాటర్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ వాటర్ ను తాగితే మీ ఆకలి కూడా కంట్రోల్ లో ఉంటుందని, దీంతో మీరు అతిగా తినకుండా ఉంటారని సులువుగా బరువు తగ్గుతారని చెబుతున్నారు.