Tulsi Leaves: ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులని తింటే అన్ని రకాల లాభాలా?

హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి మొక్క మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తులసిలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, సోడియం, ఆస్కార్బిక్ ఆమ్లం, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. వీటి వల్ల రక్త వృద్ధి, గుండెకు బలం, ఎముకలు గట్టితనం, గుండెపోటు రాకుండా గాయాలు మానేందుకు చర్మ సౌందర్యానికి అవయవాల పెరుగుదలకి ,గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ తులసి ఆకులు ఉపయోగపడతాయి. అందుకే వైద్యులు […]

Published By: HashtagU Telugu Desk
Tulsi Leaves

Tulsi Leaves

హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి మొక్క మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తులసిలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, సోడియం, ఆస్కార్బిక్ ఆమ్లం, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. వీటి వల్ల రక్త వృద్ధి, గుండెకు బలం, ఎముకలు గట్టితనం, గుండెపోటు రాకుండా గాయాలు మానేందుకు చర్మ సౌందర్యానికి అవయవాల పెరుగుదలకి ,గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ తులసి ఆకులు ఉపయోగపడతాయి.

అందుకే వైద్యులు తరచుగా తులసి కషాయం తులసి ఆకులను తీసుకోవాలని చెబుతూ ఉంటారు. అయితే మరి పరగడుపున ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయాన్నే తులసి ఆకులను నమలడం వల్ల అధిక కొలెస్ట్రాల్‌ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరిగిపోతే ప్రమాదం ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో మధుమేహంతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. మధుమేహం ఉన్నవారికి కొలెస్ట్రాల్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే వారు ఉదయాన్నే తులసి ఆకులను నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

ఇది డయాబెటిస్‌ వారికి ఎంతో మేలు చేస్తుంది. ఇక నోటి దుర్వాసనతో బాధపడేవారు తులసి ఆకులు ఎంతగానో మేలు చేస్తాయి. నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి నోటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను తినడం వల్ల రోగ నిరోధశక్తి పెరుగుతుంది. దీంతో మీరు అనేక తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడకుండా నివారించవచ్చు. అంతేకాకుండా మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. తులసి ఆకులను నమలడం వల్ల మూత్రపిండాల పనితీరు సైతం మెరుగు పడుతుంది. కిడ్నీ సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. అలాగే రక్తం శుద్ధి అవుతుంది. ఇది మొటిమలు, మొటిమల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

  Last Updated: 28 Mar 2024, 05:26 PM IST