Site icon HashtagU Telugu

Papaya: ప్రతీరోజు ఉదయాన్నే బొప్పాయి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Papaya

Papaya

ప్రస్తుత రోజుల్లో సీజన్ తో సంబంధం లేకుండా బొప్పాయి పండ్లు ఏడాది పొడవునా మార్కెట్లో లభిస్తున్నాయి. బొప్పాయి పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ బొప్పాయి పండ్లను అన్ని రకాల వయసు వారు తినవచ్చు. వీటిని తరచుగా తీసుకోమని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే బొప్పాయి పోషకాల గని అని చెప్పవచ్చు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అయితే కొంతమంది బొప్పాయిని ఉదయం పూట తింటూ ఉంటారు. మరి ఉదయం పూట బొప్పాయి తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బొప్పాయిని ఉదయాన్నే తింటే ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు జరుగుతుంది. రోజూ ఖాళీ కడుపుతో ఒక గిన్నె బొప్పాయి తినడం వల్ల శరీరానికి వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ అందుతాయి. శరీరాన్ని మలబద్ధకం సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందట. అలాగే మలబద్ధకం కాకుండా, బొప్పాయి అజీర్ణం, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ , కడుపు పూతల చికిత్సకు సహాయపడుతుందని చెబుతున్నారు. పేగు ఆరోగ్యానికి సూపర్ ఫుడ్ గా పని చేస్తుంది. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలేట్, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం, కాపర్ వంటివి ఉన్నాయి. కాబట్టి ఇది భోజనం లోని పోషకాలను బాగా గ్రహించేలా చేస్తుంది. బొప్పాయి లోని పాపైన్ వంటి ఎంజైమ్‌లు జీర్ణక్రియ కార్యకలాపాలు తగ్గినప్పుడు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయట.

ప్రోటీన్ జీర్ణక్రియను పెంచి అజీర్ణం ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే భోజనం చేసిన రెండు గంటల తర్వాత బొప్పాయిని తీసుకోవడం వల్ల పండులోని పోషకాలు మరింత సమర్ధవంతంగా శోషించబడతాయి. ఎందుకంటే ఇతర ఆహారాలు జీర్ణవ్యవస్థలో ప్రాసెస్ అయ్యే అవకాశం తక్కువ. బొప్పాయి తినడానికి భోజనం తర్వాత 2 గంటలు వేచి ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో వచ్చే స్పైక్‌లను నివారించడంలో సహాయపడుతుంది, మెరుగైన గ్లైసెమిక్ నియంత్రణను ప్రోత్సహిస్తుంది.

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.