బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. బొప్పాయి పండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. తరచుగా బొప్పాయి పండును తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇందులో ఉండే విటమిన్లు మినరల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మలబద్ధకం వంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ సి అటు ఆరోగ్యానికి ఇటు అందానికి ఎంతో మేలు చేస్తుంది.
కేవలం మలబద్ధకం మాత్రమే కాకుండా అజీర్ణం, గుండెల్లో మంట,రిఫ్లెక్స్,కడుపు పూతల చికిత్సకు కూడా బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. పేగు ఆరోగ్యానికి కూడా సూపర్ ఫుడ్ గా పని చేస్తుంది. కాగా బొప్పాయి పండులో విటమిన్ ఏ, విటమిన్ సి,విటమిన్ ఈ,ఫోలేట్, మెగ్నీషియం,పొటాషియం, కాపర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. బొప్పాయి లోని పాపైన్ వంటి ఎంజైమ్ లు జీర్ణక్రియ కార్యకలాపాలు తగ్గినప్పుడు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయట. ప్రోటీన్ జీర్ణక్రియను పెంచుతాయట. జీర్ణం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు.
భోజనం చేసిన రెండు గంటల తర్వాత బొప్పాయి తీసుకోవడం వల్ల పోషకాలు మరింత సమర్థవంతంగా శోషించబడతాయట. అలాగే బొప్పాయి లోని ఫైబర్ కంటెంట్ సహజమైన నిర్విషీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుందట. ఇది శరీరం వ్యర్థాలు, విషాన్ని బయటకు పంపడానికి అనుమతిస్తుందట. అలాగే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందట. బొప్పాయి తినడానికి భోజనం తర్వాత 2 గంటలు వేచి ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో వచ్చే స్పైక్ లను నివారించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే మెరుగైన గ్లైసెమిక్ నియంత్రణను ప్రోత్సహిస్తుందట. ఉదయాన్నే బొప్పాయి తినడం వల్ల రోజంతా కడుపు నిండిన అనుభూతి కలుగుతుందట. ఇది మీరు అనవసరంగా ఎక్కువగా తినకుండా నిరోధిస్తుందట. అయితే బరువు తగ్గాలనుకునే వారికి బొప్పాయి మంచి ఆహారం అని చెప్పాలి. ఏదైనా భోజనానికి రెండు గంటల ముందు బొప్పాయి తినడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.