వేసవికాలంలో మనకు ఎన్నో రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. వాటిలో మామిడి పండ్లు కూడా ఒకటి. ఈ మామిడి పండ్లను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. వీటి కోసం ఏడాది మొత్తం ఎంతో ఆసక్తిగా ఆశతో ఎదురు చూసే వారు కూడా ఉన్నారు. అయితే మామిడికాయల సీజన్ మొదలైంది అంటే చాలు చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు మామిడికాయలు తింటూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది ఖాళీ కడుపుతో కూడా మామిడి పండ్లు తింటూ ఉంటారు. మరి ఖాళీ కడుపుతో మామిడి పండ్లను తినవచ్చా ఒకవేళ తింటే ఏం జరుగుతుందో, ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మామిడిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. అలాగే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుందట. పచ్చి మామిడి తినడం వల్ల మంట, అజీర్ణం, విరేచనాలు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. కాగా మామిడిలో పొటాషియం ఎక్కువగా ఉంటుందట. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అని చెబుతున్నారు. అలాగే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుందట. శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుందని చెబుతున్నారు. కాగా మామిడిలో విటమిన్ సి ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అదేవిధంగా మామిడి పండ్లలో క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడే ఇతర ఫైటోకెమికల్స్ ఉంటాయి. మామిడిలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎ గా మారుతుందట. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుందట. మామిడిలో విటమిన్లు ఎ, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయని,ఇవి చర్మానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. కానీ మామిడి కాయ స్వభావం వేడిగా ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు నీటిలో నానబెట్టి తర్వాత తినాలని చెబుతున్నారు. తద్వారా చర్మ సంబంధిత సమస్యలు ఉండవట. మామిడి పండ్లు తినడానికి సరైన సమయం మధ్యాహ్నం అంటున్నారు. మామిడికాయకు వేడి స్వభావం ఉంటుంది. రాత్రిపూట మామిడి తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల కడుపులో వేడి, ముఖంపై మొటిమల ప్రమాదం పెరుగుతుందట. కాబట్టి ఉదయం సమయంలో తీసుకోవడం అంత మంచిది కాదని చెబుతున్నారు.