Site icon HashtagU Telugu

Cumin: పరగడుపున జీలకర్ర తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Cumin

Cumin

మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో జీలకర్ర కూడా ఒకటి. జీలకర్ర వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. జీలకర్రను ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పటినుంచి చాలా రకాల ఔషధాలు తయారీలో జీలకర్ర వినియోగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలకు జీలకర్ర ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అందుకే జీలకర్రను ఏదో ఒక రూపంలో తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. అయితే జీలకర్రను ఆహారంలో కాకుండా పరగడుపున నీటి రూపంలో తీసుకోవడం వల్ల మరిన్ని అద్భుతాలు జరుగుతాయట. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. మరి పరగడుపున జీలకర్ర తీసుకుంటే ఏం జరుగుతుందో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రోజుల్లో చాలామంది జీర్ణ సంబంధించిన సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. ముఖ్యంగా రాత్రి తిన్న ఆహారం సరిగా అరగక కడుపు ఉబ్బినట్టుగా, తేన్పులు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివారు పరిగడుపున జీలకర్ర తినడం అలవాటు చేసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు జీలకర్ర తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందట. ఖాళీ కడుపుతో తినేటప్పుడు రోజంతా ఆహారాన్ని మరింత ప్రభావవంతంగా విచ్ఛిన్నం చేస్తాయి. కడుపు ఉబ్బరం సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టేస్తాయని చెబుతున్నారు. కొందరికి కడుపులో యాసిడ్ ఫామ్ అయినట్టుగా అనిపించి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు జీలకర్రను ఆహారంలో భాగం చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.

ఖాళీ కడుపుతో వాటిని తీసుకోవడం ద్వారా, మీరు ఎసిడిటీ ఆ అసౌకర్య భావాలకు వీడ్కోలు చెప్పవచ్చని చెబుతున్నారు. చాలా మంది శరీరాన్ని డీటాక్సిన్ చేయడానికి మార్కెట్లోని ఏవేవో డ్రింక్స్ తాగుతూ ఉంటారు. కానీ జీలకర్ర ఈ విషయంలో చాలా అద్భుతంగా పని చేస్తుందనీ చెబుతున్నారు. జీలకర్రను నీటిలో మరిగించి ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు టాక్సిన్స్‌ ను తొలగించి అది అద్భుతంగా పని చేస్తుందట. జీలకర్రతో రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చట. ఈ చిన్న మూలకాలు మీ శరీరం సహజ రక్షణను బలోపేతం చేయడంలో సహాయపడే రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా పని చేస్తాయట. ఖాళీ కడుపుతో జీరా గింజలతో మీ రోజును ప్రారంభించడం ద్వారా, మీరు మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చుకోవచ్చని చెబుతున్నారు.

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.