Site icon HashtagU Telugu

Jack Fruit: పనసపండ్లు తొనలు ప్రతీ రోజు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా!

Jack Fruit

Jack Fruit

ప్రస్తుతం మార్కెట్లో మనకు ఎక్కడ చూసినా పసన కాయలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీటి వాసన చాలా అద్భుతంగా ఉంటుంది అన్న విషయం మనందరికి తెలిసిందే. వీటి రుచి కూడా చాలా బాగుంటుంది. పండిన పసనకాయ వాసన చాలా కమ్మగా ఉంటుంది. దీనిని కోయడం కష్టం అని చాలా మంది పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ ఈ పసనసకాయ పండిన తర్వాత దాని తొనలను రోజూ కనీసం రెండు తిన్నా మనకు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయట. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

పండిన పనసకాయలో విటమిన్లు సి, ఏ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు దీనిలో పొటాషియం, ఫైబర్ లాంటి న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఇవి మనకు చాలా ప్రయోజనాలు అందిస్తాయట. నార్మల్ గా పండులానే తినవచ్చు. లేదా చాలా రకాల వంటలు కూడా దీనితో తయారు చేస్తారు. అయితే ప్రతీ రోజు పనస పండు తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. డయాబెటిక్ పేషెంట్స్ అన్ని పండ్లు తినకూడదు. ఎందుకంటే వారి షుగర్ లెవల్స్ పెరిగిపోతూ ఉంటాయి. కానీ పనస పండు మాత్రం ఎలాంటి సందేహం లేకుండా, భయం లేకుండా తినవచ్చట. పనస పండు రుచికి తియ్యగా ఉన్నా బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడుతుందట.

షుగర్ పేషెంట్స్ ఈ పండును తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలని చెబుతున్నారు. పండిన పసన పండులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుందట. మలబద్దకం లాంటి సమస్య ఉన్నా తగ్గించేస్తుందట. అరుగుదల సమస్యలన్నీ పరార్ అయిపోతాయని చెబుతున్నారు. పసన తొనలు తినడం వల్ల మన రోగనిరోధక శక్తి బలపడుతుందట. ఎందుకంటే దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ ని కూడా బలపరుస్తుందట. సీజన్ తో పాటు వచ్చే చాలా రకాల సమస్యలు తగ్గిపోయేలా చేస్తాయట. ఈ రోజుల్లో అధిక బరువుతో బాధపడేవారు ఎంత మంది ఉన్నారో ఏం తిన్నా బరువు పెరగడం లేదని బాధపడేవారు కూడా అంతే ఉన్నారు. అలాంటివారు ఈ పనస పండు తినడం వల్ల బరువు పెరగవచ్చట. ఎందుకంటే వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి సహాయపడతాయట. ఎవరైనా హై బీపీతో బాధపడుతున్నవారు ఎవరైనా ఉంటే వాళ్లు పనస పండు తింటే చాలు. బీపీ కంట్రోల్ లో ఉంటుందట. దీనిలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుందట. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందట. అయితే మీకు ఏవైనా అలర్జీలు ఉంటే వీటికి దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు.