Site icon HashtagU Telugu

Fish Eyes: చేప కళ్ళు పడేస్తున్నారా.. అయితే ఇది తెలిస్తే అస్సలు పడేయరు!

Fish Eyes (2)

Fish Eyes (2)

అప్పుడప్పుడు మనం ఇంట్లో చేపల పులుసు చేపల ఫ్రై చేపల కబాబ్ వంటివి చేసుకొని తింటూ ఉంటాం. అయితే చాలామంది ఇంటికి చేపలు తీసుకుని వచ్చినప్పుడు చేపకళ్ళను పడేస్తూ ఉంటారు. వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని వాటిని పారవేస్తూ ఉంటారు. చేపల కళ్లలో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేక వ్యాధుల నుండి మనలను రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అలాగే విటమిన్లు, ఖనిజాలు మంచి ఆరోగ్యానికి దోహదం చేస్తాయట.

కాగా చేపలో కొల్లాజెన్ ఉంటుంది. కొల్లాజెన్ ఒక రకమైన ప్రోటీన్. ఇది చర్మం, కీళ్ళు, జుట్టు, గోళ్ళకు చాలా ముఖ్యమైనది. కొల్లాజెన్ మన శరీరంలో ఉంటుంది. కానీ వయస్సుతో, తేమ స్థాయి తగ్గుతుందట. మనం చేపల కన్ను తినడం వల్ల కొల్లాజెన్ మన శరీరంలోకి కొంత వరకు చేరుతుందని చెబుతున్నారు. ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్న వారు తరచుగా ఒత్తిడికి లోనవ్వడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అలాంటప్పుడు జ్ఞాపకశక్తి పెరగాలంటే చేప కళ్ళు తినాలని నిపుణులు సైతం చెబుతున్నారు. చేపల లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సహాయంతో బలహీనమైన జ్ఞాపకశక్తిని మెరుగుపరచవచ్చని చెబుతున్నారు.

కాగా చేపలు వాటి కళ్లలో ఉండే, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌ ల వినియోగం నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందట. చేపలు తినే ప్రతి ఒక్కరూ చేప కళ్ళు తినలేరు. అలర్జీ వంటి సమస్య వారిని వేధిస్తుందని చెబుతున్నారు. చేపలు వండడానికి ముందు వాటి కళ్లను సరిగ్గా శుభ్రం చేయకపోతే ఇతర సమస్యలు కూడా వస్తాయట. అలర్జీ లేదా మరే ఇతర సమస్యలు లేని వారు మాత్రమే చేపకళ్ళ ను తినాలని చెబుతున్నారు..