Site icon HashtagU Telugu

Fenugreek Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Fenugreek Sprouts

Fenugreek Sprouts

మామూలుగా మొలకెత్తిన గింజలు తినడం మనలో చాలా మందికి అలవాటు ఉంటుంది. వీటి వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పెసలు ఎక్కువగా తింటూ ఉంటారు. మొలకెత్తిన పెసలు మాత్రమే తింటూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మొలకెత్తిన మెంతులు తిన్నారా, ఒకవేళ తినకపోతే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొలకెత్తిన మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట.

ఈ మొలకల్లో ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయని, మొలకెత్తిన మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. కాగా మొలకెత్తిన మెంతుల్లో పుష్కలంగా ఉండే విటమిన్ సి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి బాగా సహాయపడుతుందట. ఈ మొలకలను ఉదయాన్నే తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలపడి మీరు ఎన్నో అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధులు వంటి ఇతర రోగాలకు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా మొలకెత్తిన మెంతుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుందట.

వీటిని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. అబద్ధం సమస్యతో ఇబ్బంది పడే వారికి ఈ మొలకెత్తిన మెంతులు ఎంతో బాగా మేలు చేస్తాయట. మలబద్దకం సమస్య కూడా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మొలకెత్తిన మెంతులను తింటే గుండెల్లో మంట, అసిడిటీలు కూడా తగ్గిపోతాయట భోజనానికి ముందు మొలకెత్తిన మెంతులను తింటే గుండెల్లో మంట రాదని, అందుకే జీర్ణ సమస్యలతో బాధపడే వారు మొలకెత్తిన మెంతులను తినవచ్చు అని చెబుతున్నారు. డయాబెటీస్ పేషెంట్లు కూడా మొలకెత్తిన మెంతులను తినవచ్చట. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడతాయట. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న మెంతులు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా సహాయపడతాయని, ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయడతాయని చెబుతున్నారు. ఇవి బిల్లీ ఫ్యాట్ ని కరిగించడంతోపాటు అధిక బరువు సమస్యకు చెక్ పెడతాయని చెబుతున్నారు.