Raisins : ఎండుద్రాక్ష(కిస్మిస్) తినడం వలన కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా?

ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు ఎండుద్రాక్షలో ఉన్నాయి. ఇందులో మాములు కిస్మిస్ తో పాటు నల్లని ఎండు ద్రాక్ష కూడా ఉంటాయి.

  • Written By:
  • Publish Date - November 24, 2023 / 08:00 PM IST

ఎండుద్రాక్ష(Raisins) రుచికి కాస్త పుల్లగా, తియ్యగా ఉంటుంది. అయితే దీనిని తినడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎండు ద్రాక్ష(Dry Grapes)నే కిస్మిస్(Kishmish) అని కూడా అంటాము. ఇది బయట అన్ని కాలాల్లోనూ విరివిగా దొరుకుతుంది. ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు ఎండుద్రాక్షలో ఉన్నాయి. ఇందులో మాములు కిస్మిస్ తో పాటు నల్లని ఎండు ద్రాక్ష కూడా ఉంటాయి.

ఎండు ద్రాక్షను స్వీట్స్ లో వేసుకొని, డైరెక్ట్ గా, నానబెట్టుకొని కూడా తినవచ్చు. ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టుకొని ఆ నీటిని కూడా తాగవచ్చు. ఎండుద్రాక్షను మనం ఏ సమయంలోనైనా తినొచ్చు.

* ఎండుద్రాక్షలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు మనకు క్యాన్సర్ రాకుండా ఉండేలా చేస్తుంది.
* ఎండు ద్రాక్షలో ఉండే కాల్షియం మన శరీరంలోని ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడుతుంది.
* ఎండుద్రాక్ష తినడం వలన ముఖ్యంగా రక్తహీనత సమస్య తగ్గుతుంది.
* ఎండు ద్రాక్ష తినడం వలన రక్త సరఫరా మెరుగ్గా జరుగుతుంది.
* ఎండుద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన చలికాలంలో జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది.
* ఎండుద్రాక్ష తినడం వలన మగవారిలో శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది.
* ఎండుద్రాక్ష తినడం వలన కాలేయం మెరుగ్గా పనిచేస్తుంది.
* ఎండుద్రాక్ష తినడం వలన ఆడవారిలో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.
* ఎండుద్రాక్ష తినడం వలన మనలో నీరసం పోయి ఉత్సాహం పెరుగుతుంది.