IVY Gaurd : దొండకాయలు చాలా మంది వద్దంటారు.. కానీ ప్రయోజనాలు తెలిస్తే తినకుండా వదలరు..

చాలా మంది దొండకాయ(Dondakaya)లు తినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు దొండకాయలు తినడానికి మారం చేస్తారు. దొండకాయల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - July 11, 2023 / 10:30 PM IST

దొండకాయలు(IVY Gaurd) మనకు అన్ని కాలాలలో దొరుకుతాయి. చాలా మంది దొండకాయ(Dondakaya)లు తినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు దొండకాయలు తినడానికి మారం చేస్తారు. దొండకాయతో కూర, వేపుడు, దొండకాయ 65 ,టమాటా కలిపి కూర వండుకోవచ్చు. దొండకాయల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

దొండకాయతో జ్యూస్ చేసుకొని రోజూ పరగడపున 30 ml తాగితే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఈ జ్యూస్ తాగడం వలన మన శరీరంలో పేగులు జీర్ణాశయంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపుతాయి. దీని వలన గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కడుపులో మంట వంటివి ఉంటే తగ్గుతాయి. ఈ జ్యూస్ తాగడం వలన అధిక బరువు ఉన్నవారు తగ్గుతారు.

దొండకాయలలో పోషకాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వలన మన శరీరంలో రక్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. దొండకాయలో ఉండే విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. దీని వలన ఇన్ఫెక్షన్లు తొందరగా రాకుండా ఉంటాయి. సీజనల్ చేంజెస్ వలన వచ్చే వ్యాధులు తొందరగా మన దరి చేరవు.

దొండకాయలలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు మన శరీరంలో ఫ్రీర్యాడికల్స్ ను తొలగిస్తాయి. దీని వలన క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటాయి. దొండకాయలను తినడం వలన అవి మన శరీరంలోని రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి. డయాబెటిస్ ఉన్నవారు వీటిని తినడం వారి ఆరోగ్యానికి చాలా మంచిది. దొండకాయలలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి. దీని వలన మన గుండెలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. గుండెకు సంబంధించి హార్ట్ ఎటాక్ వంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి దొండకాయలను తప్పకుండా తినేలా చూసుకోవాలి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

 

Also Read : Chicken Potato Nuggets: వెరైటీ చికెన్ పొటాటో నగ్గెట్స్ ఎప్పుడైనా ట్రై చేశారా?