భారతీయుల వంటకాలలో దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో పసుపు తప్పనిసరిగా ఉంటుంది. కేవలం వంటల్లో మాత్రమే కాకుండా పూజ కోసం కూడా పసుపును ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి పసుపులో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. అందుకే దీన్ని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. పసుపులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. పసుపు ఎన్నో వ్యాధులను నివారించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కూరకు రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ కంటెంట్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
పసుపు గుండె జబ్బులు, క్యాన్సర్, వయస్సు సంబంధిత మాక్యులర్ క్షీణత వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట. కర్కుమిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుందట. అలాగే కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గించడానికి, దాని ప్రభావాన్ని పెంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. కర్కుమిన్ అనే సమ్మేళనం సయాటికా వంటి సమస్యల వల్ల కలిగే నొప్పి, దృఢత్వం, మంటను తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా పసుపులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. పసుపు మొటిమలను తగ్గించడానికి, చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
అంతేకాదు ఇది వృద్ధాప్య లక్షణాలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే పసుపు మొటిమలు, కళ్ల చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్, డ్రై స్కిన్ నుంచి స్ట్రెచ్ మార్క్స్ వరకు ప్రతిదానిని తగ్గించడాని పసుపు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మ సంరక్షణకు తోడ్పడతాయి. ఇది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అలాగే హానికరమైన బ్యాక్టీరియాను శరీరానికి దూరంగా ఉంచుతుంది.