Copper Vessels: రాగి పాత్రలో నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు తాగకుండా అస్సలు ఉండలేరు?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రజల జీవనశైలిలో మాత్రమే కాకుండా ఆహారపు అలవాట్లలో కూడా అనేక

  • Written By:
  • Publish Date - January 16, 2023 / 06:30 AM IST

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రజల జీవనశైలిలో మాత్రమే కాకుండా ఆహారపు అలవాట్లలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఇదివరకటి రోజుల్లో నీటిని రాగి పాత్రలో లేదంటే మట్టి కుండలో తాగేవారు. కానీ రాను రాను టెక్నాలజీ డెవలప్ అవడంతో గాజు, స్టీల్, ప్లాస్టిక్ లాంటి వస్తువుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రస్తుత రోజుల్లో చాలా వరకు నీటిని తాగడానికి గాజు సిల్వర్ అలాగే వాటర్ బాటిల్స్ ని ఉపయోగిస్తున్నారు. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా తక్కువ మంది మాత్రమే రాగి పాత్రలో నీటిని తాగుతున్నారు. రాగి పాత్రలో నీరు తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే..

మరి రాగి పాత్రలో నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రాగి పాత్రలో ఉంచిన నీటిలో ఆల్కలీన్ ఉంటుంది. బట్టి దీనిని తాగడం వల్ల శరీరం కూడా చల్లబడుతుంది. వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలు నయమవుతాయి. రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల మెదడు, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. రాగి పాత్రలో నీటిని 48 గంటల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచడం వల్ల నీటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మలబద్ధకం, అసిడిటీని నివారిస్తుంది. రాగిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రాగి అధికంగా ఉండే ఆల్కలీన్ నీరు శరీరంలోని యాసిడ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవిలో ఈ నీటి వినియోగం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల అన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు ఉదయాన్నే మంచిది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తీసుకోవడం వల్ల చాలా మంచిది. రాగి పాత్ర నుండి నీటిని తాగేటప్పుడు, రాగి అనేది శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమైన ఖనిజం అనే విషయాని గుర్తు పెట్టుకోవాలి