హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతో పాటు పూజలు కూడా ఉంటారు. తులసి మొక్క కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం చాలామందికి తెలియదు. తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్క అనేక వ్యాధులకు నివారిణిగా కూడా పనిచేస్తుంది. అందుకే చాలామంది తమ ఇంట్లో ఈ మొక్కను ఖచ్చితంగా పెంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తులసి ఆకులు జలుబు, దగ్గు సమస్యలను చాలా తొందరగా తగ్గిస్తుందట. అలాగే మనకున్న ఎన్నో సమస్యలను నయం చేయడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఎన్నో లాభాలు ఉన్న ఈ తులసి ఆకులను నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తాగితే మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయట.
రోజూ తులసి ఆకులను తినడం వల్ల మన శరీరం శుభ్రపడుతుందట. అంతేకాదు మన శరీర ఉష్ణోగ్రత కూడా నియంత్రణలో ఉంటుందట. అలాగే తులసి ఆకులు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుందని, మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా చేయడానికి తులసి వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుందట. తులసి ఆకులతో చేసిన కాషాయం తాగితే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుందట. అలాగే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు చాలా తొందరగా తగ్గుతాయట. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో కొన్ని తులసి ఆకులను తింటూ తింటే కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందట. కడుపు నొప్పి సమస్య ఉంటే కొబ్బరి నీళ్లలో తులసి ఆకుల రసం, నిమ్మరసం వేసి కలుపుకుని తాగితే నొప్పి తొందరగా తగ్గిపోతుందట.
అసిడిటీ సమస్యతో బాధపడుతున్నవారుకూడా తులసి ఆకులతో తగ్గించుకోవచ్చు ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు లేదా మూడు తులసి ఆకులను బాగా నమిలి తినాలట. దీనివల్ల తొందరగా ఫలితాన్ని పొందవచ్చని చెబుతున్నారు. రుతుపవన వ్యాధులు, జీర్ణ సమస్యలు రాకుండా ఉండటానికి టీ లో కొన్ని తులసి ఆకులను వేసి మరిగించి వడకట్టి తాగాలట. దీనివల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయని, అలాగే తులసి రసం, ఆకులను తీసుకుంటే కూడా మీకు ఏ వ్యాధులు రాకుండా ఉంటాయని చెబుతున్నారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి తగ్గాలి అంటే తులసి నీటిని ప్రతిరోజూ ఉదయాన్నే పరిగడుపున తాగడం వల్ల ఆ సమస్యలు తొందరగా తగ్గిపోతాయట. డయాబెటిస్ వారికి కూడా తులసి నీరు ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారు ఈ నీటిని తరచుగా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయట.
వర్షాకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ జ్వరం బారిన పడుతుంటారు. అయితే మీరు ఈ సీజన్‌లో ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి వాటర్ ను తాగితే మీకు ఎలాంటి అంటువ్యాధులు ఆవు అని చెబుతున్నారు. తులసి వాటర్ బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందట. తులసి వాటర్ ను ఎలా తయారు చేయాలి? అన్న విషయానికి వస్తే.. ముందుగా ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టాలి. దాంట్లో 2 కప్పుల నీళ్లను పోయాలి. తర్వాత దాంట్లో కొన్ని తులసి ఆకులను వేసి దాదాపు మూడు నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఆ తర్వాత గిన్నెను దించి నీళ్లను చల్లారనివ్వాలి. ఈ వాటర్ ను వడకట్టి గోరువెచ్చగా లేదా చల్లగా అయిన తర్వాత తాగడం మంచిది అని చెబుతున్నారు. .