Tomato Juice: పరగడుపున టమోటా జ్యూస్ తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

ఉదయాన్నే పరగడుపున టమోటా జ్యూస్ ని తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Tomato Juice

Tomato Juice

ప్రతి ఒక్కరి వంటగదిలో టమోటా తప్పనిసరిగా ఉంటుంది. టమోటాను ఎన్నో రకాల వంటల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. టమోటా ను ఉపయోగించి ప్రత్యేకంగా కొన్ని వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే టమోటా కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. చాలా రకాల ఫేస్ ప్యాక్ ల కోసం టమోటాని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే టమాటాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. టమాటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, రాగి, ఫైబర్, లైకోపీన్ తో పాటుగా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా లభిస్తాయి.

మరి అలాంటి టమోటాలను జ్యూస్ చేసుకుని పరగడుపున తాగితే ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయాన్నే పరిగడుపున టమాటా జ్యూస్ ను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. టమాటాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే టమాటా జ్యూస్ ను ఉదయాన్నే తాగడం వల్ల మలబద్దకం తగ్గిపోతుంది. అలాగే గట్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. టమాటాలు విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లకు అద్భుతమైన మూలం. అందుకే ప్రతిరోజూ ఉదయం పరగడుపున టమాటా జ్యూస్ ను తాగితే మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. పొటాషియం మెండుగా ఉండే టమాటా జ్యూస్ ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

అందుకే హైబీపీ పేషెంట్లు దీన్ని రెగ్యులర్ గా తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. టమాటాల్లో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే టమాటా జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఒక కప్పు చిన్న టమాటా జ్యూస్ లో సుమారు 2 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు టమాటా జ్యూస్ ను రెగ్యులర్ గా తాగవచ్చు. అధిక బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ అధిక బరువు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తుంది. అయితే బరువు తగ్గించుకోవాలనుకునే వారికి టమాటా జ్యూస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీళ్లు రెగ్యులర్ గా టమాటా జ్యూస్ ను తాగితే బరువు తగ్గుతారు. అలాగే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

  Last Updated: 11 Sep 2024, 05:07 PM IST