ప్రతి ఒక్కరి వంట గదిలో టమోటా తప్పనిసరిగా ఉంటుంది. టమోటా ను ఎన్నో రకాల కూరల్లో ఉపయోగించడంతో పాటు ప్రత్యేకించి టమోటాతో కొన్ని రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ టమోటా జ్యూస్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున టమోటా జ్యూస్ తీసుకుంటే అధిక బరువు సమస్య నుంచి బీపీ వరకు ఎన్నో రకాల సమస్యలను అరికట్టవచ్చని చెబుతున్నారు. మరి పరగడుపున టమోటా జ్యూస్ తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టమాటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, రాగి, ఫైబర్, లైకోపీన్ తో పాటుగా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఉదయాన్నే పరిగడుపున టమాటా జ్యూస్ ను తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అవును ఉదయాన్నే పరిగడుపున టమాటా జ్యూస్ ను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందట. టమాటాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే టమాటా జ్యూస్ ను ఉదయాన్నే తాగడం వల్ల మలబద్దకం తగ్గిపోతుందట. అలాగే గట్ కూడా ఆరోగ్యంగా ఉంటుందమీ చెబుతున్నారు. టమాటాలు విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లకు అద్భుతమైన మూలం అని చెప్పాలి.
ప్రతిరోజూ పరగడుపున టమాటా జ్యూస్ ను తాగితే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంద ట. పొటాషియం మెండుగా ఉండే టమాటా జ్యూస్ ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందట. అందుకే హైబీపీ పేషెంట్లు దీన్ని తరచుగా తాగవచ్చని చెబుతున్నారు. అలాగే టమాటాల్లో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందట. అలాగే టమాటా జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే గుండె ఆరోగ్యంగా ఉంటుందట. డయాబెటిస్ పేషెంట్లు కూడా ఎలాంటి సందేహాలు లేకుండా ఈ టమోటా జ్యూస్ ని తాగవచ్చట. అధిక బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ అధిక బరువు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తుందట. అయితే బరువు తగ్గించుకోవాలనుకునే వారికి టమాటా జ్యూస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, వీళ్లు రెగ్యులర్ గా టమాటా జ్యూస్ ను తాగితే బరువు తగ్గుతారట. అలాగే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.