Sugarcane : ప్రెగ్నెన్సీ సమయంలో చెరకు రసం తాగుతున్నారా?….అయితే ఇది తప్పకుండా చదవాల్సిందే..!!!

గర్భందాల్చిన స్త్రీలకు రకరకాల కోరికలు ఉంటాయి. ఆహారం విషయంలో చాలా మార్పులు కనిపిస్తుంటాయి. ఆకస్మాత్తుగా నచ్చని ఫుడ్ కూడా తినాలనిపిస్తుంది. గర్భధారణ సమయంలో మీరు తీసుకునే ఆహారం...బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది

  • Written By:
  • Publish Date - June 23, 2022 / 12:15 PM IST

గర్భందాల్చిన స్త్రీలకు రకరకాల కోరికలు ఉంటాయి. ఆహారం విషయంలో చాలా మార్పులు కనిపిస్తుంటాయి. ఆకస్మాత్తుగా నచ్చని ఫుడ్ కూడా తినాలనిపిస్తుంది. గర్భధారణ సమయంలో మీరు తీసుకునే ఆహారం…బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో జ్యూస్ లు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు గైనాకాలాజిస్టులు.

కానీ చాలామందికి గర్భధారణ సమయంలో చెరుకు రసం తాగవచ్చా…లేదా అనే సందేహం ఉంటుంది. అయితే గర్భం దాల్చిన సమయంలో చెరుకు రసం తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

పోషక విలువలు..
చెరుకు రసంలో విటమిన్ ఎ, బీ1, బి2, బి3, బి5,బి6, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇవేకాకుండా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కూడా ఉంటాయి. చెరుకు రసం గర్భిణీ స్త్రీలకు ఎంతో సురక్షితమైంది. అయితే మీకు డయాబెటిస్ లేదా గర్భాధారణ షుగర్ ఉన్నట్లయితే…ఈ సమయంలో చెరుకు రసం తాగకూడదు.

మలమద్దకాన్ని నివారించడంలో…
చాలామంది గర్భిణీలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో మలబద్దకం ఒకటి. గర్భధారణ సమయంలో చెరుకు రసం తీసుకుంటే…ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. చెరుకు రసం తాగడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు కడుపు ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షిస్తుంది.

ఇన్ఫెక్షన్లతో పోరాటం…
గర్భిణీలు రోజువారీ ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. చెరుకు రసం తాగడం వల్ల కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు బ్యాక్టీరియా, ఫంగల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడేందుకు సహాయపడతుంది.

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం…
గర్భధారణ సమయంలో మీకు దగ్గు లేదా జలుబు ఉన్నట్లయితే…చెరుకు రసం తీసుకుంటే ఎంతో సహాయపడుతుంది.

బిలిరుబిన్ స్థాయిలను సమతుల్యం చేయడంలో…
కాలేయం సరిగ్గా పనిచేయడానికి సరైన మొత్తంలో బిలిరుబిన్ అవసరం ఉంటుంది. చెరుకు రసాన్ని రోజూ తీసుకుంటే బిలిరుబిన్ స్థాయిలను నియంత్రించవచ్చు. ఇది మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇమ్యూనిటీని పెంచుతుంది…
గర్భం హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. గర్భధారణ సమయంలో అనారోగ్యంగా…అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో చెరుకు రసం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి. ఫలితంగా ఆరోగ్యంగా ఉంటారు.

మార్నింగ్ సిక్ నెస్ నివారిస్తుంది..
గర్భిణీలు చాలా మంది మార్నింగ్ సిక్ నెస్ సమస్యను ఎదుర్కొంటారు. ఈ సయమంలో చెరుకు రసం తీసుకుంటే ఉపశమనం ఉంటుంది. మార్నింగ్ సిక్ నెస్ లక్షణలను అధిగమించేందుకు చెరుకు రసంలో కొంచెం అల్లం రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు .

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నుంచి …
చాలామంది స్త్రీలు గర్భాధారణ సమయంలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతుంటారు. ఇది చాలా బాధాకరమైంది. చెరుకు రసం తాగడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ను దూరం చేసుకోవచ్చు.

మొటిమలను నివారిస్తుంది…
గర్భం సమయంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా ముఖంపై మొటిమలు వస్తాయి. చెరుకు రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మొటిమలను దూరం చేసుకోవచ్చు. అంతేకాదు చెరుకు రసం, ముల్తానీ మట్టిని కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకోవచ్చు.

ప్రెగ్నెన్సీ సమయంలో చెరుకు రసం తీసుకునేటప్పుడు గమనించాల్సిన విషయాలు ఏంటంటే..
గర్భధారణ సమయంలో చెరుకు రసం తీసుకోవడం సురక్షితమే కానీ…తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. చెరుకు రసాన్ని శుభ్రమైన ప్రదేశం నుంచి కొనాలి. మితంగా తీసుకోవడం మంచిది. అందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. షుగర్ కానీ గర్భధారణ షుగర్ కానీ ఉన్నట్లయితే చేరుకు రసం తీసుకోవద్దు. డాక్టర్ సలహామేరకు చెరుకు రసాన్ని మీ డైట్ లో చేర్చుకోవడం మంచిది.