ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలుపుకొని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రోజంతా కూడా హైడ్రేట్ గా ఉండవచ్చట. ఇందులో పొటాషియం కాల్షియం మెగ్నీషియం మూలకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకొని కలుపుకొని తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుందట. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులకు దివ్యౌషధంలా పనిచేస్తుందని చెబుతున్నారు.
ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఉప్పునీరు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందట. ఇందులో ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట. నిత్యం నీటిలో ఉప్పు కలిపి తాగితే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే ఉదయాన్నే ఉప్పు నీరు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలోని ఆమ్లాన్ని సమతుల్యత చేస్తుందట. జీర్ణ అగ్నిని ప్రేరేపిస్తుందని,మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఉప్పు నీరు శరీరానికి అవసరమైన మినరల్స్ అందిస్తుందట. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జలుబు, దగ్గు, వంటి అంటు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుందని, ఉప్పు నీరు తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.
కాగా ఉప్పు నీరు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుందట. ఇది మొటిమలు, చర్మ వ్యాధులను తగ్గిస్తుందని, దీనిని ఉపయోగించడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుందని, అలాగే చుండ్రు సమస్య కూడా తొలుగుతుందని,ఎక్కువ ఉప్పును తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలు కలుగుతాయని చెబుతున్నారు. కాగా ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు విడుదలవుతాయట. తద్వారా అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చని,అంతేకాకుండా, ఉప్పునీరు మూత్రపిండాలు, కాలేయాలను ఆరోగ్యంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.