సబ్జా గింజల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ప్రతిరోజు తినడం వల్ల జీర్ణక్రియకు తోడ్పడతాయి. కడుపుకు సంబంధించిన అనేక రకాల వ్యాధులను కూడా దూరం చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా అదుపులో ఉంచుతాయట. కాగా ఈ సబ్జా గింజల్లో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయట. ప్రతి 100 గ్రాములలో 42 శాతం పిండి పదార్థాలు ఉండే ఈ గింజలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయట. ఈ గింజలలోని పిండి పదార్థాలు జీవక్రియను ప్రోత్సహిస్తాయట.
అలాగే మూత్ర పిండాలు, గుండె,కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరులో సహాయపడతాయని చెబుతున్నారు. దీన్ని రోజూ తినడం వల్ల జీర్ణక్రియకు తోడ్పడుతుందట. అలాగే కడుపు వ్యాధులను దూరం చేస్తుందట. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. అలాగే సబ్జా గింజలు ఎముకలు, కండరాలు, చర్మాన్ని బలోపేతం చేయడానికి, శరీర పనితీరును మెరుగుపరచడానికి, శరీరంలో ఎంజైమ్‌లు, హార్మోన్లు ,ఇతర రసాయనాల ఉత్పత్తిని పెంచడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయని కాబట్టి వీటిని ప్రతి రోజు తినాలని చెబుతున్నారు.
ఈ చిన్న నల్ల గింజలు చాలా తక్కువ కేలరీల కంటెంట్ కలిగి ఉంటాయట. స్లీప్ అప్నియా, కీళ్ల వ్యాధులు, కొలెస్ట్రాల్, రక్తపోటు , క్యాన్సర్‌ను తగ్గించడానికి ఈ విత్తనాలను మీ దినచర్యలో చేర్చుకోవాలని చెబుతున్నారు. అలాగే ఈ గింజల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుందట. ఇది కడుపు సమస్యలను దూరం చేస్తుందట. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను మెరుగుపరుస్తాయట. మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి. మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయట. సబ్జా గింజలు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ వంటి వివిధ ఖనిజాల ఉంటాయని చెబుతున్నారు. సబ్జా గింజలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కి గొప్ప మూలం, ఇది డిప్రెషన్ , యాంగ్జైటీతో పోరాడటానికి సహాయపడుతుందట. కళ్లకు మంచిది, పిండం అభివృద్ధిలో సహాయపడుతుంది, గుండె సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల సులభంగా బరువు కూడా తగ్గవచ్చని చెబుతున్నారు.