నిమ్మకాయ నీరులో చక్కెర వేసుకొని కలుపుకొని తాగడం అన్నది కామన్. ఈ పానీయాన్ని వేసవికాలంలో ఎక్కువగా తాగుతూ ఉంటారు. అలా ఎండలకు వెళ్లి వచ్చినప్పుడు నీరసంగా అనిపించినప్పుడు ఈ నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. అయితే నిమ్మకాయ నీరులో చక్కెరకు బదులుగా చిటికెడు బ్లాక్ సాల్ట్ జోడించి తాగితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయట. అలాంటి నిమ్మకాయ నీరు తాగితే కలిగే ప్రయోజనాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. బ్లాక్ సాల్ట్ జీర్ణక్రియకు అద్భుతాలు చేస్తుందట.
అలాగే ఉబ్బరం, ఆమ్లతను నియంత్రిస్తుందట. అజీర్ణాన్ని ఉపశమింపజేస్తుందని చెబుతున్నారు. ఇందులో పొటాషియం, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉన్నాయట. ఈ ఖనిజాలు శరీర విధులను నిర్వహించడానికి, మొత్తం ఆరోగ్యానికి అవసరం అని చెబుతున్నారు. అలాగే జీర్ణ ఎంజైముల ఉత్పత్తిని ప్రేరేపించడానికి సహాయపడుతుందట. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుందట. సాధారణ టేబుల్ సాల్ట్ తో పోలిస్తే, బ్లాక్ సాల్ట్ సోడియం కలిగి ఉంటుందట. సోడియం తీసుకోవడం పట్ల జాగ్రత్త వహించే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పాలి. ఇకపోతే నిమ్మకాయ నీళ్లు, బ్లాక్ సాల్ట్ లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుందట.
ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడి, శరీరాన్ని బలంగా ఉంచుతుందట. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచి, జలుబు, జ్వరం వంటి అనారోగ్యాలను ఎదుర్కొంటుందని, విషపదార్థాలను తొలగిస్తుందని చెబుతున్నారు. అలాగే నిమ్మకాయ నీళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడతాయట. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలను నివారించడానికి సహాయపడుతుందట. షుగర్ ను బ్లాక్ సాల్ట్ తో భర్తీ చేయడం వల్ల నిమ్మకాయ నీళ్లు ఆరోగ్యకరమైన అమృతంలా మారతాయట. ఇది బరువు నిర్వహణకు అద్భుతంగా ఉంటుందట. నిమ్మకాయ నీళ్లు అధిక విటమిన్ సి కంటెంట్ కారణంగా స్పష్టమైన, మెరిసే చర్మాన్ని ఇస్తాయట. కాగా తరచుగా ఈ నిమ్మకాయ నీళ్లు తాగే వ్యక్తుల్లో ఈ క్యాన్సర్ రిస్క్ తక్కువగా ఉంటుందట.